ఛత్తీస్గఢ్ ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఏపీ జవాన్లు మృతి.. మరో నెలలో పెళ్లి ఉండగా !

-

ఛత్తీస్గఢ్ ఎన్ కౌంటర్ లో ఇద్దరు తెలుగు జవాన్లు మృతి చెందారు. మృతులు ఇద్దరూ కోబ్రా దళానికి చెందిన జవాన్లు గా తెలుస్తోంది. గుంటూరు జిల్లాకు చెందిన శాఖమూరి మురళీకృష్ణ, విజయనగరం దిగువ వీధికి చెందిన రైతు జగదీశ్ అనే ఇద్దరు మృతి చెందినట్లు తెలుస్తోంది. జగదీష్ మృతితో గాజులరేగ లో విషాదం నెలకొంది.. మే 22న జగదీష్ వివాహం కూడా నిశ్చయం అయినట్లు చెబుతున్నారు. దీంతో జగదీష్ మరణ వార్తతో కుటుంబంలో విషాదం నెలకొంది. అలాగే ఆయన చనిపోయిన రోజును గాజులరేగ వాసులు బ్లాక్ డే గా ప్రకటించారు. ఆయన అంతిమ యాత్రకు కూడా గ్రామస్తులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది..

 

ఇక శాఖమూరి మురళీకృష్ణ మృతితో గుంటూరు జిల్లాలో కూడా విషాదఛాయలు అలుముకున్నాయి మురళీకృష్ణ సిఆర్పిఎఫ్ లో ఏడేళ్లుగా పనిచేస్తున్నారు ఆయన సోదరుడు పేర్కొన్నారు.. మురళి కి ఘన నివాళులు అర్పించేందుకు ఏపీ ప్రభుత్వం సహకరించాలని ఆయన కోరారు. ఇక చత్తీస్గడ్ ఎన్కౌంటర్ లో మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే మావోయిస్టుల కాల్పులు 24 మంది జవాన్లు మృతి చెందారు. 31 మంది జవాన్లకు గాయాలు అయ్యాయి. ఇందులో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది అయితే ఇంకా ఒక జవాన్ ఆచూకీ మాత్రం తెలియడం లేదు. ఈ దాడులకు హిడ్మా వ్యూహకర్తగా వ్యవహరించాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ జవాన్ కోసం చత్తీస్గడ్ ప్రాంతాలను అదనపు బలగాలు జల్లెడ పడుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version