రేపే రధసప్తమి..సూర్య దేవుడిని ఇలా సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు..!

-

రథ సప్తమి ఎప్పుడు మాఘ మాసంలో వస్తుంది. మాఘ మాసంలో ఏడో రోజున వచ్చే సప్తమిని సూర్య సప్తమి లేదా రథ సప్తమి అని అంటారు. ఈ ఏడాది 28 జనవరి 2023 శనివారం అనగా రేపు వచ్చింది. ఈ రోజు సూర్య దేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు భక్తులు పూజలు చేసి ఉపవాసం వుంటారు. ఈరోజున సూర్య దేవుడికి పూజలు చేసి వ్రతాన్ని ఆచరించడం వల్ల సకల పాపాలు తొలగిపోయని భక్తుల నమ్మకం. అలానే రథ సప్తమి రోజున కొన్ని పరిహారాలను తప్పకుండా పాటిస్తే ఎంతో మంచిది. మరి ఈ రోజు ఏం చెయ్యాలి..? ఇటువంటివి ఆచరించాలి అనే ముఖ్య విషయాలని చూసేద్దాం.

రథసప్తమి నాడు ఉప్పు తీసుకోకూడదు ఉప్పుని రథసప్తమినోడు తీసుకోకుండా ఉంటే మంచిది. అలానే పేదలకి ఈరోజు ఉప్పుని దానం చేయడం చాలా మంచిది. ఉపవాస వ్రతాన్ని ఆచరించే వాళ్ళు ఉప్పు తినకుండా కేవలం పండ్లను మాత్రమే తీసుకోవాలి ఇలా చేయడం వలన జీవితంలో అడ్డంకులు అన్నీ కూడా తొలగిపోతాయి.
ఉద్యోగం కోసం చూసే వాళ్ళు వ్యాపారంలో లాభాలు రావాలని చూసే వాళ్ళు రథసప్తమినాడు ఎర్రని రంగులో ఉండే ఆవులకు బెల్లం తినిపిస్తే మంచిది గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారని మనకి తెలిసిన విషయమే ఎర్రటి రంగులో ఉండే గోమాతకి బెల్లం తినిపిస్తే ముక్కోటి దేవతలు కూడా ఆనందిస్తారు. ఉద్యోగం వస్తుంది వ్యాపారం అభివృద్ధి చెందుతుంది.
రథసప్తమి నాడు పుణ్య నదులులో స్నానం చేయడం కూడా చాలా మంచిది సూర్యోదయం వేళ స్నానం చేస్తే శుభ ఫలితాలు పొందవచ్చు. ఒకవేళ కనుక నది స్నానం చేయలేకపోతే నదీ జలాన్ని కొంచెం మీరు స్నానం చేసే నీటిలో కలుపుకుని చేస్తే కూడా మంచిది.
అలానే రాగి పాత్రలో నీరు పోసి ఎర్రని పుష్పాన్ని అందులో ఉంచి దానితో సూర్యునికి అర్ఘ్యం సమర్పిస్తే కూడా ఎంతో మంచి కలుగుతుంది అదృష్టం వస్తుంది.
రథసప్తమి నాడు మట్టికుండలో పాలను ఉంచి కొద్దిగా వేడి చేసిన తర్వాత సూర్యకిరణాలలో ఆ పాలని ఉంచి దానితో పరవాన్నం చేసి లక్ష్మీదేవికి సూర్య భగవానునికి నైవేద్యం పెడితే కూడా శుభ ఫలితాన్ని పొందొచ్చు.
రథసప్తమి నాడు పసుపు రంగులో ఉండే బట్టలు, బెల్లం, రాగితో చేసిన వస్తువులు, గోధుమలు వంటివి దానం చేస్తే చాలా మేలు కలుగుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version