వాస్తు: పూజ మందిరంలో ఈ మార్పు చేస్తే ఆనందంగా ఉండచ్చు..!

మీరు ఏమైనా సమస్యలతో చింతిస్తున్నారా..? అయితే వాస్తు ప్రకారం పండితులు చెబుతున్న ఈ చిట్కాలని పాటించండి. పండితులు చెబుతున్న ఈ ఉపాయాలను కనుక మీరు ఫాలో అయ్యారంటే కచ్చితంగా సమస్య నుండి బయట పడవచ్చు. మరి ఇక ఆలస్యం ఎందుకు వాటి కోసం చూసేద్దాం.

మనకి నిత్యం ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. ఇటువంటి సమస్యల నుండి బయట పడాలంటే కచ్చితంగా ఈ వాస్తు టిప్స్ బాగా ఉపయోగపడతాయి. వాస్తు శాస్త్రం ప్రకారం ఈ రంగుని కనుక పూజ గదిలో వేసుకుంటే పాజిటివ్ ఎనర్జీ వస్తుందని నెగిటివిటీ పూర్తిగా దూరమైపోతుంది అని పండితులు అంటున్నారు.

మన ఇంట్లో నిశ్శబ్దంగా ఉండే ప్రదేశం పూజ గది. పూజగదిలో కూర్చుంటే ఎంతో రిలాక్స్ గా, ప్రశాంతంగా ఉండొచ్చు. మనం పనులు పూర్తయిన తర్వాత ఒకసారి పూజగదిలో కూర్చుంటే ఎంతో హ్యాపీగా ఉంటుంది. అయితే అటువంటి ప్రదేశంలో తప్పకుండా ప్రశాంతతనిచ్చే రంగులు వేసుకుంటే మంచిదని పండితులు అంటున్నారు.

పూజ గదిలో లేత పసుపు రంగు వేసుకుంటే ప్రశాంతంగా ఉండొచ్చని నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా దూరం అయిపోతుంది అని పండితులు అంటున్నారు. అదే విధంగా కాషాయం రంగు, ఎరుపు రంగు కూడా మంచిదని అంటున్నారు. గచ్చు తెలుపు రంగు లో ఉంటే మంచిది. ఈ విధంగా మీరు మార్పులు చేస్తే కచ్చితంగా ఆనందంగా ఉండొచ్చు.