ఇళ్లు, కార్లలో పులిబొమ్ములు పెట్టుకుంటున్నారా..? వాస్తు ఏం చెప్తుందంటే..

-

మీరు చాలా మంది కార్లలో వెనుక పులిబొమ్ములు చూసే ఉంటారు. ఇవి ఏదో అట్రాక్టివ్‌గా ఉంటాయని పెట్టుకుంటారు. ఇళ్లలో కూడా పులిబొమ్మలు పెట్టుకుంటారు. ఏదో అందంగా ఉంటుందని మనం అనుకుంటాం.. కానీ వాస్తుప్రకారం.. ఇంట్లో కొన్ని ఉంచకూడని వస్తువులు ఉంటాయి.. అవి ఇంట్లో ఉంటే.. నెగిటిన్‌ ఎనర్జీ స్ప్రెడ్‌ అయి లేనిపోని సమస్యలు వస్తాయి. వాస్తుదోషం ఉంటే.. ఆ ఇల్లు పైకిలేవదు.. ఎంత సంపాదించినా వచ్చిన దారినుంచే పోతాయి.

చాలా మంది ఇళ్ల‌లో పులి బొమ్మ‌ల‌ను లేదా పులి ఫొటోలు, పెయింటింగ్‌ల‌ను పెట్టుకుంటుంటారు. కానీ వాస్తు ప్ర‌కారం వీటిని పెట్టుకోకూడ‌దు. ఇది క్రూర‌మృగం. అందువ‌ల్ల ఇంట్లోకి నెగెటివ్ ఎన‌ర్జీని ఆహ్వానిస్తుందట.. కాబ‌ట్టి ఇంట్లో లేదా కార్ల‌లో ఎట్టి ప‌రిస్థితిలోనూ పులి బొమ్మ‌లు, ఫొటోల‌ను పెట్ట‌కూడ‌దు. లేదంటే వాస్తు దోషం ఏర్ప‌డి స‌మ‌స్య‌లు వ‌స్తాయి. ఇక ఇదే కాకుండా ఇంట్లో పెట్టుకోకూడ‌ని వ‌స్తువులు కూడా కొన్ని ఉన్నాయి.

ఇంట్లో ఇలాంటి ఫోటోలు పెట్టకూడదు..

యుద్ధాల‌కు సంబంధించిన ఫొటోలను లేదా పెయింటింగ్స్‌, ముళ్లు క‌లిగి ఉండే బ్ర‌హ్మ‌జెముడు లేదా నాగ‌జెముడు చెట్ల‌ను, పండ్లు, పూలు లేని చెట్ల‌కు చెందిన ఫొటోలు, మునిగిపోతున్న ప‌డ‌వ ఉన్న పెయింటింగ్‌లు, న‌గ్న చిత్రాలు, బొమ్మ‌లు, క‌త్తుల‌తో యుద్ధం చేస్తున్న‌ట్లు ఉండే ఫొటోలు, బొమ్మ‌లు, వేటాడేవి, బంధించ‌బ‌డిన ఏనుగుల‌కు చెందిన ఫొటోలు, విచారంతో కూడిన పెయింటింగ్స్ వంటి వాటిని ఎట్టి ప‌రిస్థితిలోనూ ఇంట్లో పెట్ట‌రాదు. పెడితే నెగెటివ్ ఎనర్జీ పెరిగిపోయి వాస్తు దోషాలు ఏర్ప‌డుతాయి. అప్పుడు ఇంట్లో వారికి అన్నీ స‌మ‌స్య‌లే వ‌స్తాయి. వాటిని ఇంట్లో పెట్టుకునే వారు ఒక‌సారి ముందుగానే ప‌రిశీలించి స‌రైన విష‌యాల‌ను తెలుసుకుని మ‌రీ పెట్టుకోవాలి. లేదంటే ఇబ్బందులు ప‌డాల్సి వ‌స్తుంది.

సింపుల్ లాజిక్‌.. మీరు ఇంట్లో పెట్టుకునే ఫోటోలు పాజిటివ్‌ వైబ్స్‌ కలిగి ఉండాలి.. అందులో చెడు అనేది చూస్తేనే కనిపిస్తుంది అంటే.. అలాంటి వాటిని అస్సలు పెట్టుకోకూడదు.. మీరు పైన చెప్పినవి గమనిస్తే… వాటిలో అన్ని నెగిటివ్‌ ఎనర్జీని స్ప్రెడ్‌ చేసేవే ఉన్నాయి.. పచ్చనిచెట్లు, ప్రశాంతంగా కనిపించే బొమ్మలు ఇంట్లో పెట్టుకుంటే.. మీకు కళ్లకు మంచిగా అనిపిస్తుంది. ఎలాంటి ఇబ్బందులు ఉండవు.

Read more RELATED
Recommended to you

Latest news