ఇంట్లో ఉండే ప్రతి వస్తువును సరైన దిశలో ఉంచడం చాలా అవసరం. వాస్తు శాస్త్రం ప్రకారం చెప్పిన నియమాలను పాటించి ఇంట్లో వస్తువులను సరైన పద్ధతిలో ఉంచడం వలన ఎన్నో ఇబ్బందులు లేకుండా జీవించవచ్చు. చాలా శాతం మంది ఇంట్లో ఇనుముతో తయారుచేసిన గుర్రపు డెక్కను ఉంచడం వలన ప్రతికూల శక్తి తొలగిపోయి సానుకూల శక్తి పెరుగుతుంది అని నమ్ముతారు. ముఖ్యంగా, దుష్ట శక్తులను తొలగించడానికి ఇనుము చాలా ఉపయోగపడుతుంది. ఇనుముతో తయారుచేసిన గుర్రపు డెక్కను ఇంటి ముఖద్వారం దగ్గర ఉంచడం వలన ఎంతో మంచి ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు.
అయితే శనివారం రోజున ఇంటి ముఖ ద్వారం వద్ద దీన్ని కట్టడం ఎంతో మంచి జరుగుతుంది అని భావిస్తారు. గుర్రపు డెక్కను ఇంటి ముందు ఉంచడం వలన ఎన్నో ఇబ్బందులు తొలగిపోతాయి. పైగా విజయాన్ని సాధించి మంచి పేరుని పొందవచ్చు. ఉత్తర దిశలో గుర్రపు డెక్కను కట్టడం వలన మరింత ప్రయోజనం ఉంటుంది అని చెప్పవచ్చు. ఆర్థిక సమస్యలతో బాధపడేవారికి ఇది ఎంతో మేలు చేస్తుంది అని పండితులు చెబుతున్నారు. ఇంటి గుమ్మం దగ్గర దీనిని కట్టడం ద్వారా ధనానికి లోటు ఉండదు మరియు శ్రేయస్సు, సంపదలు పెరుగుతాయి.
యు ఆకారంలో ఉండే గుర్రపు డెక్కను ఇంటి గుమ్మానికి కట్టడం వలన అదృష్టం పెరుగుతుంది. అంతే కాకుండా ప్రతికూల శక్తి పూర్తిగా తగ్గిపోతుంది. యు ఆకారంలో ఉండే గుర్రపు డెక్క క్షీణించిన చంద్రుడికి సంకేతంగా భావిస్తారు. అందువలన ఇది సంతాన ఉత్పత్తి, సంపద అభివృద్ధికి అనుకూలంగా మారుస్తుంది. కనుక ఇంటి ముఖద్వారం దగ్గర యు ఆకారంలో ఉండే గుర్రపు డెక్కను తప్పకుండా ఉండాలి అని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఈ విధంగా సానుకూల శక్తి పెరగడం వంటి ఉపయోగాలు మాత్రమే కాకుండా జీవితంలో సంపదను మరియు ఆనందాన్ని కూడా పొందవచ్చు.