ఎప్పుడైతే వాస్తు శాస్త్రంలో చెప్పిన నియమాలను పాటిస్తారో, ఎంతో ప్రశాంతకరమైన జీవితాన్ని పొందవచ్చు. ముఖ్యంగా ఇంట్లో సానుకూల శక్తిని పెంచడానికి ఈ చిట్కాలు ఎంతో ఉపయోగపడతాయి. కనుక ఎలాంటి పొరపాట్లను చేయకుండా ఈ వాస్తు చిట్కాలను తప్పకుండా పాటించండి. ఇలా చేస్తే అదృష్టం పెరుగుతుంది మరియు ఎంతో ఆనందంగా జీవించవచ్చు. ఎప్పుడూ కూడా ఇంట్లో గులాబీ మొక్కలు కాకుండా ముళ్ళ మొక్కలు ఏవి ఉండకుండా జాగ్రత్త పడాలి. ఎప్పుడైతే ఇంట్లో ముళ్ళ మొక్కలను పెడతారో, ప్రతికూల శక్తి ఎక్కువ అవుతుంది.
అయితే ఇంటిని నిర్మించే సమయంలో క్యాక్టస్ మొక్క ఉండడం వలన ఎంతో మంచి జరుగుతుంది. పైగా నరదృష్టి వంటి సమస్యలు తగ్గిపోతాయి. సహజంగా ఇంటిని నిర్మించిన తర్వాత ఇంటి చుట్టుపక్కల చెక్కలు, టైల్స్, ఇటుకలు, ఇసుక వంటివి ఉంటాయి. అయితే ఇంట్లో సానుకూల శక్తి ప్రవహించాలంటే, ఇంటి చుట్టుపక్కల ఇలాంటివి ఉండకుండా శుభ్రంగా ఉండే విధంగా చూసుకోవాలి. కొంతమంది ఇంట్లో విరిగిపోయిన లేదా పగిలిపోయిన వస్తువులను ఉంచుతూ ఉంటారు. వాటి వలన ప్రతికూల శక్తి ఎక్కువ అవుతుంది. ముఖ్యంగా విరిగిపోయిన కుళాయిలు లేదా నీళ్లు కారుతున్న కుళాయిలు ఇంట్లో ఉండకూడదు.
ఇంట్లో ఉండే తలుపులు, కిటికీలకు సంబంధించిన హ్యాండిల్స్ ఊడిపోతే వాటిని వెంటనే ఏర్పాటు చేయాలి. వాటిని మార్చకుండా ఉంచితే, ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఇటువంటి పరిహారాలను పాటించడంతో పాటుగా ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం ఎంతో అవసరం అనే చెప్పాలి. ఇంటి మధ్యలో ఉండే స్థానాన్ని బ్రహ్మస్థానం అంటారు. ముఖ్యంగా ఆ ప్రదేశం ఎంతో శుభ్రంగా ఉండాలి. ఇలా చేస్తే ఇంట్లో సానుకూల శక్తి ప్రవహిస్తుంది. వీటితో పాటు ఈశాన్యం, నైరుతి వైపు కూడా ఎంతో శుభ్రతను పాటించాలి. దీని వలన ఎంతో ఆనందంగా సానుకూల శక్తితో జీవించవచ్చు అని వాస్తు నిపుణులు చెబుతున్నారు.