జమ్ముకాశ్మీర్‌లోని పహెల్గాంలో టూరిస్టు ప్రాంతంలో టెర్రరిస్టులు రెచ్చిపోయిన విషయం తెలిసిందే. అన్యాయంగా 26 మంది పర్యాటకులను హతమార్చారు. వారిపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. తూటాల వర్షం కురిపించడంతో అమాయకుల ప్రాణాలు గాల్లో కలిశాయి. పచ్చని పర్యాటక ప్రాంతంలో కాల్పుల కారణంగా నెత్తుటి మరకాలు ఇంకా తడరలేదని తెలుస్తోంది.
ఇదిలాఉండగా, తీవ్రవాదుల చర్యలను నిరసిస్తూ శుక్రవారం నమాజ్ అనంతరం ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ పిలుపుమేరకు ముస్లిములు పాతబస్తీలో పాకిస్తాన్ కు వ్యతిరేకంగా తీవ్ర నిరసన ప్రదర్శన చేపట్టారు. నల్ల రిబ్బన్లు ధరించి నమాజ్ చేసిన అసదుద్దీన్ ఒవైసీ.. పహల్గాంలో ఉగ్రదాడికి నిరసనగా నల్ల రిబ్బన్లు ధరించాలని ముస్లిములకు పిలుపునిచ్చారు. నమాజ్ అనంతరం ‘హిందూస్థాన్ జిందాబాద్.. పాకిస్తాన్ ముర్దాబాద్’ అంటూ ముస్లిములు నిరసన తెలిపారు.