ఇస్రో మాజీ చైర్మన్ కన్నుమూత.. సీఎం రేవంత్ సంతాపం

-

ప్రముఖ శాస్త్రవేత్త ఇస్రో మాజీ చైర్మన్, పద్మ విభూషణ్ డాక్టర్ కృష్ణస్వామి కస్తూరి రంగన్ మృతి పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంతాపం తెలియజేశారు. భారతీయ అంతరిక్షపరిశోధనా రంగంలలో కస్తూరి రంగన్  విశేష సేవలు అందించారని గుర్తు చేసుకున్నారు. 1994 నుంచి 2003 వరకు ఇస్రో చైర్మన్ గా ముఖ్యంగా పీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ ప్రయోగాల్లో వారు పోసించిన పాత్ర దేశం మరిచిపోదని .-పేర్కొన్నారు. 

రాజ్యసభ సభ్యుడిగా, జేఎన్యూ వైస్ ఛాన్స్ లర్ గా కేంద్ర ప్రభుత్వ అంతరిక్ష విభాగం కార్యదర్విగా ప్రణాళికా సంఘం సభ్యుడిగా అనేక పదవుల్లలో విశేష సేవలు అందించిన డాక్టర్ కస్తూరి రంగన్ మరణం దేశం ఒక గొప్ప ఖగోళ శాస్త్రవేత్తను కోల్పోయిందని పేర్కొన్నారు. భగవంతుడు వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం సానుభూతిని తెలియజేశారు.

Read more RELATED
Recommended to you

Latest news