తెలంగాణలో ఎమ్మార్ ప్రాపర్టీస్ సంస్త చేపడుతున్న వివిధ ప్రాజెక్టులు సుదీర్ఘకాలంగా పెండింగ్ పడుతున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ వ్యవహారాన్ని పరిష్కరించేందుకు 2015లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఆనాటి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీకి అదనంగా న్యాయ నిపుణులతో కూడిన మరో కమిటీ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి తాజాగా సూచించారు.
న్యాయ వివాదాలను అధ్యయనం చేయడానికి సామరస్య పూర్వక పరిష్కారం చేసుకోవడానికి యూఏఈ ప్రభుద్వ ఆమోదంతో ఒక లీగల్ ఏజెన్సీని ఏర్పాటు చేస్తామని సంస్త ప్రతినిధులు చేసిన ప్రతిపాదనను సీఎం ఆమోదించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే కమిటీ ఆ ప్రతినిధులతో సంప్రదింపులు జరిపి తదుపరి సూచనలు, సలహాలు అందిస్తుందని చెప్పారు. వివిధ కేసులతో పెండింగ్ లో ఉన్న తమ ప్రాజెక్టుల వివాదాలను పరిష్కరించాలని కోరుతూ దుబాయ్ కి చెందిన ఎమ్మార్ ప్రాపర్టీస్ సంస్త రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించింది.