Vasthu : మీ ఇంట్లో ఎప్పుడూ డబ్బులు ఉండాలంటే.. ఈ మార్పులు చేయండి..!

-

ఎంత డబ్బు సంపాదించినా కూడా కొన్నిసార్లు చేతిలో డబ్బులు నిలవవు. అత్యవసర పరిస్థితుల్లో అప్పులు కూడా పుట్టవు. చాలా కష్టంగా ఉంటుంది. ప్రస్తుత కాలంలో డబ్బులు లేకపోతే బతకడం చాలా కష్టం. ప్రతి పనికి కూడా డబ్బు అవసరం. డబ్బులు ఉంటేనే కడుపునిండా తినగలం. నచ్చినవి చేయగలం. సమాజంలో గౌరవం ఉండాలంటే డబ్బు కచ్చితంగా ఉండాలి. అయితే డబ్బు ఇంట్లో ఉండాలన్నా, డబ్బు సమస్యలు కలగకుండా ఉండాలన్నా వీటిని పాటించడం మంచిది.

ఇలా చేయడం వలన ఆర్థిక ఇబ్బందులే ఉండవు. తులసి మొక్కను హిందువులు ఎంతో పవిత్రంగా ఆరాధిస్తారు. పూజలు కూడా చేస్తారు. ఇంట్లో డబ్బు నిలవకపోతే రోజూ తులసి మొక్కని పూజించండి. ఇది డబ్బుని తీసుకొస్తుంది. అలాగే చాలా మందిని ఇంటిని ఎలా పడితే అలా వదిలేస్తారు. ఇలా చేయడం వలన డబ్బు అసలు ఉండదు.

ముఖ్యంగా సంపదకు ఉత్తర దిశకు ముడిపడి ఉంటుంది. ఈ దిశనుఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి అని వాస్తు నిపుణులు చెప్తున్నారు. ఇంట్లో ఆడవారైనా మగవారైనా ఎక్కువసేపు నిద్రపోకూడదు. ఇలా నిద్రపోతే ప్రతికూలతకు దారి తీస్తుంది. అలాగే డబ్బుని గౌరవించాలి. చాలామంది ఇంట్లో డబ్బును ఎక్కడ పడితే అక్కడ ఉంచుతారు. అది తప్పు. డబ్బుని అవమానించినట్లు అవుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version