బీజాపూర్ సరిహద్దుల్లో ఎన్‌కౌంటర్.. మావోయిస్టు అగ్రనేత మృతి

-

ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యంలో మరోసారి ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. దంతెవాడ – బీజాపూర్ సరిహద్దుల్లో మావోయిస్టులు సంచరిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు దంతెవాడ పోలీసులు సోమవారం ఉదయం స్పెషల్ ఆపరేషన్ నిర్వహించారు.

Massive encounter in Chhattisgarh 12 Maoists killed

ఈ క్రమంలోనే మావోయిస్టులు వారికి ఎదురుపడగా పోలీసులు కాల్పులు జరిపారు. దీంతో ఇరుపక్షాల మధ్య భీకరంగా ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు మహిళా అగ్రనేత రేణుక స్పాట్‌లోనే మృతి చెందింది. మిగతా దళ సభ్యులు పోలీసులు కళ్లుగప్పి అక్కడి నుంచి తప్పించుకున్నారు.ఈ మేరకు దంతెవాడ పోలీసులు రేణుక మృతదేహంతో పాటు తుపాకీ, మందుగుండు సామగ్రి, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version