ఎప్పుడైతే లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందో అప్పుడే ఆర్థిక సమస్యలు లేకుండా ఎంతో ఆనందంగా జీవిస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలంటే తప్పకుండా ఇంట్లో సానుకూల శక్తి ప్రవహించాలి. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులను ఇంట్లో ఉంచడం వలన ఎన్నో కష్టాలు తొలగిపోతాయి మరియు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆనందంగా జీవించవచ్చు. ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో బాధపడుతుంటే తప్పకుండా ఇటువంటి వస్తువులను మీ ఇంట్లో ఉంచండి. దీంట్లో మీ సమస్యలన్నీ తగ్గుతాయి. పైగా అదృష్టం కూడా ఎక్కువగా ఉంటుంది. సహజంగా ఇంట్లో పూజ గదిలో మాత్రమే కాకుండా దేవుడి విగ్రహాలను లేక చిత్రపటాలను ఉంచుతారు.
లక్ష్మీదేవి చిత్రపటాన్ని కనుక ఈశాన్య దిశలో పెడితే ఇంట్లో సానుకూల శక్తి ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. లక్ష్మీదేవి చిత్రపటం తో పాటుగా ఈశాన్యంలో లాఫింగ్ బుద్దాను కూడా పెట్టవచ్చు. దీనివలన ఎంతో అదృష్టాన్ని పొందుతారు మరియు మీ సమస్యలు తొలగిపోయి అభివృద్ధి చెందుతారు. సాధారణంగా వ్యాపారస్తులు గవ్వలను పెట్టడం వలన అదృష్టం కలిసి వస్తుందని, దీంతో ఆదాయం పెరుగుతుందని భావిస్తారు. అదేవిధంగా దేవుడి దగ్గర మాత్రమే కాకుండా డబ్బులు నిలువ ఉండే ప్రదేశంలో కూడా గవ్వలను ఉంచవచ్చు.
బీరువాలో, క్యాష్ కౌంటర్ వంటి ప్రదేశాలలో గవ్వలను ఉంచడం వలన ఐశ్వర్యాన్ని పొందవచ్చు. ఎప్పుడైతే ఇంట్లో నెమలీకలను ఉంచుతారో సానుకూల శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. దీంతో ప్రతికూల శక్తి పూర్తిగా తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందవచ్చు. పైగా పూజ చేసిన తర్వాత ప్రతి రోజు భగవంతునికి గాలిను నెమలి పించం తో విసరవచ్చు. ఈ విధంగా చేస్తే ఎన్నో సమస్యలు తొలగిపోతాయి. ముఖ్యంగా మీ ఆదాయం కూడా పెరుగుతుంది. ఈ విధమైన వస్తువులను ఇంట్లో పెట్టడం వలన కష్టాలు తొలగిపోతాయి మరియు ఆర్థికంగా దృఢంగా మారతారు.