సహజంగా కొన్ని సందర్భాలలో ఇతరుల నుండి సహాయం తీసుకుని కొన్ని వస్తువులను ఉచితంగా తెచ్చుకుంటూ ఉంటాము. కాకపోతే వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులను ఇతరుల నుండి ఉచితంగా తీసుకోకూడదు. ఎప్పుడైతే వాస్తు శాస్త్రంలో చెప్పిన విషయాలను పాటిస్తారో జీవితంలో ఎన్నో సమస్యలకు దూరంగా ఉండవచ్చు. వాస్తు శాస్త్రాన్ని అశ్రద్ధ చేసి ఉచితంగా ఈ వస్తువులను తెచ్చుకుంటే ఎన్నో కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది అని వాస్తు నిపుణులు చెబుతున్నారు. చాలా శాతం మంది కొన్ని సందర్భాలలో ఇతరుల షూ, చెప్పులను ఉపయోగిస్తూ ఉంటారు మరియు వాటిని ఉచితంగా తీసుకోవడం వలన జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా రోజు చేసే పనులలో ఆటంకాలను ఎదుర్కోవడం, పేదరికానికి గురవడం వంటివి ఎదురవుతాయి.
అంతేకాకుండా షూ మరియు చెప్పులను తెచ్చుకోవడం వలన ఒత్తిడి వంటి సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అదేవిధంగా ఉప్పుని ఇతరుల నుండి ఉచితంగా తెచ్చుకోకూడదు. ఎప్పుడైతే ఇతరుల నుండి ఉప్పుని ఉచితంగా తెచ్చుకుంటారో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. ఉప్పు శని దేవుడు మరియు సూర్యుడికి సంబంధించినది దానివలన ఉచితంగా ఉప్పుని తెచ్చుకుంటే పేదరికాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకవేళ ఇతరుల నుండి ఉప్పుని తెచ్చుకోవాలి అంటే ఉచితంగా కాకుండా ఉప్పుకు బదులుగా ఏదైనా ఇచ్చి తెచ్చుకోవాలి. సూదులను కూడా ఇతరుల నుండి ఉచితంగా తెచ్చుకుంటే ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా ప్రతికూల శక్తి పెరిగిపోతుంది.
దీనివలన ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. సూదులను ఉచితంగా తెచ్చుకుంటే మానసిక ఒత్తిడి కూడా పెరిగిపోతుంది మరియు కుటుంబంలో సమస్యలు కూడా ఎదురవుతాయి. కనుక వాస్తు శాస్త్రం ప్రకారం ఇతరుల నుండి ఉచితంగా సూదులను అస్సలు తెచ్చుకోకూడదు. జేబు రుమాలిని కూడా ఉచితంగా తీసుకోకూడదు మరియు బహుమతిగా కూడా ఎవరికీ ఇవ్వకూడదు. ఎప్పుడైతే ఇతరుల దగ్గర నుండి జేబురుమాలును తీసుకుంటారో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక ఎవరి దగ్గర జేబురుమాలును ఉచితంగా తీసుకోకూడదు లేక ఉపయోగించకూడదు. కనుక ఈ విధమైన వస్తువులను తీసుకోకపోవడమే మేలు అని వాస్తు నిపుణులు చెబుతున్నారు.