బీఆర్ఎస్ ను మించిన కాంగ్రెస్.. బడ్జెట్ పై బండి సంచలన వ్యాఖ్యలు

-

రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ ని పరిశీలిస్తే.. డొల్ల అని తేలిపోయిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. బడ్జెట్ తీరును విశ్లేషిస్తే.. అబద్దాలు.. అంకెల గారడీ.. 6 గ్యారంటీలకు పాతరేసేలా రాష్ట్ర బడ్జెట్ ఉందని, ఓం భూం బుష్ అంటూ మాయ చేసేందుకే ప్రయత్నిస్తున్నట్లు స్పష్టంగా కన్పిస్తోందని ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యంగా గత బడ్జెట్
కేటాయింపులు, ఖర్చులను పరిశీలిస్తే పొంతనే లేదని, అయినప్పటికీ బడ్జెట్ కేటాయింపులు పెంచి రాష్ట్ర ప్రజలను దారుణంగా మోసం చేసేందుకు బడ్జెట్ను సాధనంగా చేసుకోవడం సిగ్గు చేటన్నారు. 6
గ్యారంటీలను పూర్తిగా తుంగలో తొక్కేశారని ఆరోపించారు.

ఎన్నికలకు ముందు మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా పేర్కొన్న కాంగ్రెస్ నేతలు అధికారంలోకి వచ్చాక చిత్తుకాగితంగా మార్చినట్లు ఈ బడ్జెట్ ద్వారా వెల్లడైందన్నారు. తెలంగాణ ప్రజల తలసరి ఆదాయం భారీగా పెరిగినట్లు బడ్జెట్లో గొప్పలు చెప్పిన సర్కార్.. అప్పుల వివరాలను కూడా బడ్జెట్ లో పొందుపరిచి ఒక్కో తెలంగాణ పౌరుడిపైనా, చివరకు పుట్టబోయే బిడ్డపైనా ఎంత అప్పు భారం ఉందో వాస్తవాలను వివరిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version