బడ్జెట్ లో పేజీలే పెరిగాయి.. సంక్షేమం కాదు : హరీశ్ రావు

-

మహిళలను తెలంగాణ ప్రభుత్వం మోసం చేస్తోందని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు బడ్జెట్ లో అబద్దాలు, అతిశయోక్తులే ఉన్నాయన్నారు. మహిళలకు రూ.5లక్షలు మాత్రమే వడ్డీలేని రుణాలు ఇస్తున్నారు. బడ్జెట్ లో మాత్రం రూ.లక్ష కోట్లు వడ్డీలేని రుణాలు ఇస్తున్నామన్నారు. బడ్జెట్ పేజీలు పెరిగాయి.. తప్ప పేదలకు సంక్షేమం పెరగలేదన్నారు.

మహిళలకు రూ.2500 హామీ ఊసే లేదు. కానీ అందాల పోటీలకు రూ.250 కోట్లు బడ్జెట్ లో పెట్టారు. గత సంవత్సరం రూ.5,888 కోట్ల రెవెన్యూ మిగిలి ఉంది. ఈ సంవత్సరం రూ.2,738 కోట్లు రెవెన్యూ మిగిలి ఉంటుంది అని బడ్జెట్ బుక్ లో రాసారు. కానీ రేవంత్ రెడ్డిని ఉద్యోగులు జీతాలు అడిగితే రూ.500 కోట్లు కూడా లేవు అని అబద్ధాలు చెప్తున్నాడు. రేవంత్ రెడ్డి మంత్రిగా ఉన్న విద్యాశాఖకు బడ్జెట్‌లో గత ఏడాది కంటే తక్కువ కేటాయింపులు చేశారు. రూ.304965 కోట్ల బడ్జెట్‌లో విద్యాశాఖకు కేటాయించింది రూ.23108 కోట్లు(7.57%). గతేడాది రూ.274058 కోట్ల బడ్జెట్‌లో విద్యాశాఖకు కేటాయించింది రూ.21292 కోట్లు(7.77%). ఎన్నికలకు ముందు బడ్జెట్‌లో 15% విద్యాశాఖకు కేటాయిస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version