కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..!

-

యూపీఐ లావాదేవీలు రూ. 210 లక్షల కోట్లకు చేరుకున్నాయని కేంద్ర ఐటీ, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. రూ. 2 వేల కంటే తక్కువ విలువ కలిగిన లావాదేవీలకు ఎలాంటి ఛార్జీ లేదని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.  ప్రస్తుత యూపీఐ విధానంలో కస్టమర్ బ్యాంక్, ఫిన్‌టెక్ సంస్థ, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్, యాప్ సంస్థ ద్వారా 4 అంచెల్లో లావాదేవీలు జరుగుతున్నాయని వివరించారు. తద్వారా లావాదేవీల్లో చార్జీలను భరించాల్సి వస్తోందని పేర్కొన్నారు. రూ.1,500 కోట్లు ఇన్సెంటివ్ రూపంలో చిన్న లావాదేవీలకు చార్జి లేకుండా చేస్తున్నామన్నారు. బుధవారం న్యూఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశమైంది. ఈ సమావేశం ముగిసిన అనంతరం ఈ కేబినెట్‌లో తీసుకున్న పలు నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ విలేకర్ల సమావేశంలో వెల్లడించారు.

ఈశాన్య రాష్ట్రమైన అసోంలోని నామ్‌రూప్ వద్ద రూ.10, 601 కోట్లతో అమ్మోనియా ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలిపారు. అలాగే బ్రహ్మపుత్రా వ్యాలీ ఫెర్టిలైజర్ ప్లాంట్‌లో అమ్మోనియా – యూరియా ఉత్పత్తి చేపడతామన్నారు. మరోవైపు మహారాష్ట్రలో రూ.4,500.62 కోట్లతో 6 వరుసల గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మించాలని ఈ కేబినెట్‌ భేటీలో నిర్ణయించినట్లు వెల్లడించారు. ఇది JNPA Port  నుంచి చౌక్ వరకు బీఓటీ పద్ధతిలో నిర్మాణం చేపడుతున్నట్లు వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version