రేషన్ పంపిణీ పై సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు కీలక ప్రశ్నలు..!

-

ఒక కేసు విచారణలో భాగంగా సుప్రీంకోర్టు ప్రభుత్వాలకు పలు ప్రశ్నలు సంబంధించింది. దేశంలోని పలు రాష్ట్రాలు రేషన్ పంపిణీ వ్యవస్థల ద్వారా నిరుపేదలకు సబ్సీడీతో కూడిన నిత్యావసర సరుకులను సరఫరా చేస్తున్నామని చెప్పుకుంటున్నట్టు గుర్తు చేసింది. ఈ రేషన్ బీపీఎల్ లబ్దిదారుల కుటుంబాలకు చేరడం లేదని పేర్కొంది. రాస్ట్రాలు రేషన్ కార్డులను ప్రదర్శన కోసం ఉపయోగిస్తున్నారా..? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. రేషన్ కార్డు ప్రయోజనాలు నిజంగా లబ్దిదారులు చేరుతున్నాయా..? లే అర్హత లేని వ్యక్తుల జేబుల్లోకి చేరుతున్నాయా..?  అని సుప్రీం కోర్టు అడిగింది.

సుప్రీంకోర్టులో జస్టీస్ సూర్యకాంత్, ఎన్.కోటీశ్వర్ సింగ్ ధర్మాసనం ఈ ప్రశ్నలు సంధించింది. అధిక మొత్తంలో రేషన్ కార్డులు జారీ చేశామని చెప్పుకునే రాష్ట్రాలు రేషన్ కార్డులను ప్రదర్శన కోసం ఉపయోగిస్తున్నాయని కోర్టు మండిపడింది. కరోనా-19 మహమ్మారి సమయంలో వలస కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై దాఖలు అయిన కేసును విచారించిన కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఆదాయపు పన్ను చెల్లించేవారికి ఉచిత రేషన్ కట్ చేసేందుకు ఇప్పటికే కేంద్రం చర్యలు తీసుకుంటోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version