ఈ ఏడాది జనవరి 26, 2023 వసంత పంచమి వచ్చింది, వసంత పంచమి నాడు ఈ విధంగా అనుసరిస్తే ధనం ఆరోగ్యం విజయం మీ వెంట ఉంటాయి. అయితే మరి వసంత పంచమి నాడు ఏ విధంగా అనుసరించాలి. ఎలాంటి పద్ధతుల్ని ఫాలో అవ్వాలి అనేది చూద్దాం.
వసంత పంచమి నాడు సరస్వతి దేవికి ఎర్రటి పూలని ఎర్రటి మందారాలని పెడితే చాలా మంచి కలుగుతుంది. విజయాన్ని పొందడానికి అవుతుంది.
విద్యార్థులు చదువులో ముందుండాలంటే సరస్వతి దేవి విగ్రహాన్ని స్టడీ టేబుల్ మీద పెట్టుకోవడం మంచిది.
అలానే వాళ్ళు చదివేటప్పుడు తూర్పు వైపు కూర్చోబెట్టి చదివించండి. బాగా చదివేందుకు ఇది సహాయ పడుతుంది.
పిల్లలు చదువుకునే గదిలో గోడ రంగులు లైట్ క్రీమ్ లేదా తెలుపు రంగు లో ఉండేటట్టు చూసుకోండి.
వాస్తు కి సంబంధించిన దోషాలు ఏమైనా ఉంటే వసంత పంచమి రోజు మీరు వాటిని సరి చేసుకోవడం మంచిది.
ఉత్తరం వైపు బెడ్ రూమ్ ని ఉంచుకుంటే చాలా మంచిది ఇది మీకు అవకాశాలని పెంచేందుకు సహాయపడుతుంది.
ఉత్తరం వైపు మీ లాకర్ ని ఉంచడం కూడా చాలా మంచిది.
ఇంటి దక్షిణం దిశ ద్వారా పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. వసంత పంచమి రోజు వీలైనంత వరకు నెగటివ్ ఎనర్జీని తొలగించేసి పాజిటివ్ ఎనెర్జీని వెనక్కి తీసుకురావడానికి చూసుకోండి. వసంత పంచమి నాడు సరస్వతి దేవికి పూజ చేస్తే కూడా ఎంతో చక్కటి ప్రయోజనాన్ని మీరు పొందవచ్చు. ఇలా ఈ విధంగా మీరు వసంత పంచమినాడు అనుసరిస్తే ధనం ఆరోగ్యం విజయం మీ వెంట ఉంటాయి. ఇబ్బందులన్నీ కూడా తొలగి పోతాయి.