వాస్తు: చెప్పుల్ని విడిచేటప్పుడు ఈ తప్పులని అస్సలు చెయ్యద్దు..!

-

వాస్తు ప్రకారం నడుచుకుంటే ఏ బాధ ఉండదు. చాలామంది వాస్తు ప్రకారం నడుచుకుంటున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం మనం అనుసరిస్తే ఏ బాధ ఉండదు ఏమైనా సమస్యలు ఉన్నా సరే తొలగిపోతాయి. వాస్తు ప్రకారం నడుచుకోవడం వలన పాజిటివ్ ఎనర్జీ కలిగి నెగిటివ్ ఎనర్జీ దూరమవుతుంది. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం చెప్పులని విడిచి పెట్టేందుకు కూడా ఓ పద్ధతి ఉంది చెప్పులని విడిచేటప్పుడు ఈ తప్పులు అసలు చేయకూడదు అని వాస్తు పండితులు అంటున్నారు. మరి చెప్పుల్ని విడిచేటప్పుడు ఎటువంటి తప్పులు చేయకూడదు అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.

ఈ దిక్కున వద్దు:

వాస్తు శాస్త్రం ప్రకారం చెప్పులని విడిచేటప్పుడు సరైన దిశ లో విడిచి పెట్టాలి. ఈశాన్య వైపు నిలబడి చెప్పులని అస్సలు విడవకూడదు. ఇలా విడవడం వలన చెడు జరుగుతుంది. సమస్యలు వస్తాయి.

బెడ్ రూమ్ లో విడవద్దు:

వాస్తు శాస్త్రం ప్రకారం ఎప్పుడూ కూడా చెప్పాలని షూ ని బెడ్రూంలో వదలకూడదు ఇది కూడా నెగటివ్ ఎనర్జీని కలిగిస్తుంది. భార్యాభర్తల మధ్య గొడవల ని కూడా ఇది తీసుకు వస్తుంది.

ఇంటి ముఖద్వారం:

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ముఖద్వారం దగ్గర పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అందుకని ముఖద్వారం దగ్గర వివిధ రకాలుగా మనం అలంకరించుకుంటూ ఉంటాం. ఇంటి ముఖద్వారం దగ్గర చెప్పులని విడిచిపెట్టి వదిలేయడం వలన నెగటివ్ ఎనర్జీ వస్తుంది. పాజిటివ్ ఎనర్జీ దూరమైపోతుంది కాబట్టి ముఖద్వారం ఎదురుగా కూడా మీరు చెప్పులని విడిచి పెట్టకండి ఇలా ఈ విధంగా మీరు అనుసరిస్తే ఏ బాధ ఉండదు ఇబ్బందులు అన్నీ కూడా దూరం అవుతాయి. ఆనందంగా ఉండచ్చు. సమస్యలే రావు.

Read more RELATED
Recommended to you

Exit mobile version