వాస్తు: పక్షులకి నీళ్లు, ఆహారం ఇచ్చే ముందు వీటిని గుర్తు పెట్టుకోండి..!

-

వాస్తు ప్రకారం నడుచుకుంటే ఏ బాధ ఉండదు. అందుకే చాలా మంది వాస్తు ప్రకారం ఇంట్లో సామాన్లని సర్దుకుంటూ వుంటారు. వాస్తుకు విరుద్ధంగా ఏమైనా సామాన్లు ఉంటే మంచి జరగదని, ఆదాయం తగ్గిపోతుందని, ధన నష్టం కలుగుతుందని, చెడు జరుగుతుందని అందరూ పాటిస్తూ ఉంటారు. అయితే ఈ రోజు వాస్తు పండితులు మనకి పక్షులకు సంబంధించిన కొన్ని విషయాలను కూడా చెప్పారు. మరి వాటి కోసం ఈరోజు తెలుసుకుందాం.

పక్షులకు నీళ్లు, ఆహారం ఇచ్చే ముందు ఈ తప్పులని చెయ్యకూడదు అని చెప్పారు. పండితులు చెప్పిన విధంగా ఆచరిస్తే ఎలాంటి సమస్యలైనా సరే తొలగిపోతూ ఉంటాయి. పక్షులకి ఆహారం పెట్టినప్పుడు నీటిని ఇచ్చేటప్పుడు ఇలా చేయండి. వాస్తు శాస్త్రం ప్రకారం పక్షులకు ఆహారం ఇవ్వడం నీళ్లు ఇవ్వడం చాలా మంచిది. మీ ఇంటి ముందు పక్షులకి ఆహారం పెడితే చాలా మంచి కలుగుతుంది. తూర్పు దిశ లో ఉత్తరం దిశ లో కూడా పెట్టొచ్చు. కావాలంటే మేడ మీద ఆయనా సరే మీరు ఏర్పాటు చేయొచ్చు.

పిల్లలు లేని వాళ్ళు చిన్న చిన్న పక్షులకి ఆహారం పెట్టడం వలన పిల్లలు పుట్టే అవకాశం వస్తుంది. అలానే పక్షులకి ఆహారం పెట్టినప్పుడు ప్రత్యేక శ్రద్ధని పెట్టడం మర్చిపోకండి. మీరు వీటికి ఆహారం అందించే క్రమం లో ఆహారాన్ని వృధా చేసినట్లయితే పితృదోషం కలుగుతుంది. ఎర్రటి ధాన్యాలని అస్సలు పక్షులకి పెట్టొద్దు. గోధుమలు వంటివి పెట్టొచ్చు. చూశారు కదా పండితులు చెప్పిన అద్భుతమైన చిట్కాలను మరి వీటిని అనుసరించి పాజిటివ్ ఎనర్జీని మంచిని పొందండి ఇబ్బందులు లేకుండా హాయిగా ఉండండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version