వాస్తుని అనుసరించడం వల్ల ఎలాంటి సమస్య అయినా తొలగిపోతుంది. చాలా మంది ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు అటువంటి వాళ్ళు వాస్తు చిట్కాలను అనుసరిస్తే ఆనందంగా ఉండడానికి అవుతుంది. అయితే మరి పండితులు చెప్పిన అద్భుతమైన వాస్తు చిట్కాల గురించి చూద్దాం. పెళ్లి అనేది జీవితంలో చాలా మధురమైనది. అయితే వైవాహిక జీవితంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఉండాలన్నా.. ఆలుమగలు ఆనందంగా కలిసి ఉండాలన్నా వాస్తు చిట్కాలు బాగా ఉపయోగపడతాయని వాస్తు పండితులు అంటున్నారు.
ఈ విధంగా కనుక భార్య భర్తలు అనుసరిస్తే తప్పకుండా వాళ్ళ మధ్య బంధం బాగుంటుంది. అలానే ఎలాంటి గొడవలు లేకుండా ఆనందంగా ఉంటారు. భార్యభర్తల మధ్య సమస్యలు రాకుండా ఉండాలంటే బెడ్ రూం లో లైట్ రంగులు వేయించుకోవాలి. ముదురుగా ఉండే రంగులను పెయింట్ కింద వేయడం వల్ల నెగటివ్ ఎనర్జీ వస్తుంది.
అందుకనే లైట్ కలర్ పెయింట్ వేయించుకోవాలి. అలానే బెడ్రూం లో అద్దం ఉండటం వల్ల నెగటివ్ ఎనర్జీ ఉంటుంది. ముఖ్యంగా మంచానికి ఎదురుకుండా అద్దం ఉండకూడదు. ఇది సమస్యలకు దారి తీస్తుంది. కాబట్టి ఈ తప్పు చేయకండి.
అలానే లాప్టాప్, మొబైల్ ఫోన్లు, టీవీ వంటివి బెడ్రూంలో ఉండకూడదు. వీటిని బెడ్రూంలో ఉంచడం వల్ల భార్య భర్తల మధ్య గొడవలు అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ తప్పులు కూడా చేయకండి ఇలా బెడ్ రూమ్ లో ఈ మార్పులు చేస్తే భార్య భర్తల మధ్య గొడవలు ఉండవు. ప్రశాంతంగా, ఆనందంగా ఉండొచ్చు.