Vastu: ఈ మార్పులు చేసారంటే.. మీ దశ తిరిగిపోతుంది.. కాసుల వర్షమే..!

-

ప్రతీ ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలని అనుకుంటారు. కానీ అందరికీ అది సాధ్యం కాదు. మన ఇంట్లో ఏదో ఒక గొడవ రావడం.. లేదంటే ఆర్థిక ఇబ్బందులు దీనితో ప్రశాంతత ఉండదు. సంతోషంగా ఉండడానికి అవ్వదు. వ్యక్తిగత జీవితంలో కూడా మంచి శ్రేయస్సు ఉండాలంటే వాస్తు ప్రకారం ఫాలో అవ్వాలి. వాస్తు ప్రకారం ఇంట్లో ఈ మార్పులు చేయడం చాలా మంచిది. ఏ దిక్కులో ఏం ఉండాలి అనేది తప్పక తెలుసుకోవాలి. ఇంటి బయట కానీ ఇంటి లోపల కానీ తూర్పు దిశలో చెత్త కుప్పలు వేస్తే దరిద్రం పట్టుకుంటుంది. ఇబ్బందుల్లో కూరుకు పోవాల్సి ఉంటుంది.

  • తూర్పు దిక్కున ఇంటి కంటే ఎత్తుగా చెట్లని పెంచడం వలన ఇబ్బందులు ఎదుర్కోవాలి. బరువైన వస్తువుల్ని తూర్పు దిశలో పెట్టడం వలన అశాంతి కలుగుతుంది.
  • ఇంటి ఆగ్నేయ దిశ అన్ని దిశలు కంటే ఎత్తుగా ఉంటే ఆ ఇంట్లో వాళ్ళందరికీ అనారోగ్యం కలుగుతుంది.
  • ఇల్లు కట్టుకున్న భూమి త్రిభుజాకారంలో ఉండి ఆగ్నేయంలో శిఖరం ఉంటే అగ్ని విపత్తు కలుగుతుంది.
    అలాగే ఆగ్నేయ దిశలో నుయ్యి కానీ నీరు నిల్వ ఉన్నా గృహంలో నివసించే వాళ్ళకి ఖర్చులు ఎక్కువ అవుతాయి. అప్పులు కూడా ఎక్కువగా ఉంటాయి.
  • ఉత్తరాది కంటే దక్షిణాదిలో ఎక్కువ ఖాళీ స్థలం ఉన్నట్లయితే ఇంటి యజమానికి వయసు ప్రభావ సమస్యలు కలుగుతాయి.
  • నైరుతి దిశకు సమీపంలో తలుపు ఉంచినట్లయితే ప్రమాదం కలుగుతుంది.
  • వంటగది నైరుతిలో ఉంటే కూడా ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
  • ముందు తలుపు వీలైనంత వరకు ఉత్తరం లేదా తూర్పు వైపు ఉండేటట్టు చూసుకోవాలి. ఈశాన్య దిక్కులో ఉంటే శుభప్రదం.
  • ఇంటి తలుపు ఎప్పుడు కూడా నైరుతి దిశలో ఉండకుండా చూసుకోవాలి.
  • మెట్లు తూర్పు, ఆగ్నేయం లేదా ఉత్తర వాయువ్యంగా ఉండాలి.

Read more RELATED
Recommended to you

Latest news