వంట గది ఏ దిశలో ఉండాలి ? ఈ మార్పులు చేస్తే సంతోషంగా ఉండొచ్చు..!

-

జీవితంలో ఎన్నో సమస్యల నుండి బయటపడడానికి వాస్తు శాస్త్రం ఎంతో సహాయం చేస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం చెప్పిన విషయాలను పాటించడం వలన ఎన్నో రకాల ఇబ్బందుల నుండి దూరంగా ఉండవచ్చు. పైగా ఎంతో సంతోషకరమైన జీవితాన్ని పొందవచ్చు. ముఖ్యంగా ఇంట్లోకి సరైన శక్తి ప్రవహించాలి అంటే వాస్తు శాస్త్రాన్ని తప్పకుండా పాటించాలి. దీని వలన ఇంట్లో వాస్తు దోషాలు తొలగిపోయి ఎంతో ఆనందంగా జీవిస్తారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం వంట గదిలో కూడా సరైన జాగ్రత్తలు పాటించడం వలన ఇంట్లో వాస్తు దోషాలు తొలగిపోయి ఎంతో సంతోషంగా ఉండవచ్చు.

ముఖ్యంగా ఇంటిని నిర్మానిస్తున్నప్పుడే వాస్తు నియమాలను ఎంతో జాగ్రత్తగా పాటించాలి. ఇలా చేయడం వలన వాస్తు దోషాలు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. సరైన దశలో ఇంటి ప్రధాన ద్వారం ఉండాలి. మన ఇంట్లోకి శక్తి ప్రవేశించాలి అంటే ప్రధాన ద్వారం నుండే ప్రవేశిస్తుంది. కనుక ఇది ఎంతో జాగ్రత్తగా ఏర్పాటు చేయాలి. చాలా శాతం మంది వాస్తు శాస్త్రాన్ని పాటించకపోవడం వలన జీవితంలో ఎన్నో సమస్యలని ఎదుర్కొంటారు. కనుక ఇంట్లో చిన్న చిన్న మార్పులను చేయడం వలన ఎంతో మంచి ఫలితాలను పొందవచ్చు. ముఖ్యంగా వంటగది సరైన దిశలో లేకపోవడం వలన ఇంట్లో అసమతుల్యత అనేది ఏర్పడుతుంది.

వంటగది అనేది ఆగ్నేయం వైపు ఉంటే ఎంతో మంచి జరుగుతుంది. చాలా మంది విరిగిపోయిన, పగిలిపోయిన వస్తువులను ఇంట్లో ఉంచుతూ ఉంటారు. పగిలిపోయిన మరియు విరిగిపోయిన వస్తువులను ఇంట్లో ఉంచడం వలన ప్రతికూల శక్తి ఇంట్లోకి వస్తుంది. దీంతో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంట్లో సానుకూల శక్తి ప్రవహించాలి అంటే కచ్చితంగా తులసి మొక్కను ఏర్పాటు చేసుకోవాలి. దీనితో పాటుగా లక్కీ బ్యాంబు మొక్కను కూడా పెట్టడం వలన ఎంతో అదృష్టాన్ని తీసుకొస్తుంది. వాస్తు దోషాలు కనుక ఇంట్లో ఉన్నట్లయితే పిరమిడ్ లేక స్వస్తిక్ గుర్తును ప్రధాన ద్వారం పై ఉంచడం వలన ఎంతో మంచి జరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news