వికసిత్ భారత్ సాధనే మా లక్ష్యం అని భారత ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. లోక్ సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మాణం పై చర్చ సందర్భంగా ప్రధాని మాట్లాడారు. రాష్ట్రపతి ప్రసంగం మాలో ఆత్మవిశ్వాసం నింపింది. మధ్య తరగతి ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తాం. గత ప్రభుత్వాలు గరిబీ హఠావో అని నినాదాలు మాత్రమే చేశాయి. కొందరు నేతలు బంగ్లాలు కట్టుకోవడం పై ఆసక్తి చూపారు.
పదేళ్లలో 25 కోట్ల మంది పేదరికం మంది బయటికి వచ్చారు. పేదలకు ఇప్పటి వరకు 4 కోట్ల ఇండ్లు నిర్మించామని తెలిపారు. దేశంలో పేదల కోసం 12 కోట్లకు పైగా మరుగుదొడ్లు నిర్మించాం. కొందరూ నేతలు పేదల గుడిసెల వద్ద వారితో ఫొటోలు దిగేందుకే ఉత్సాహం చూపిస్తారు. సభలో పేదల గురించి మాట్లాడితే.. ఫొటోలకు ఫోజులిచ్చిన నేతలు మొహం విసుగ్గా పెడతారు. ఢిల్లీ నుంచి రూపాయి పంపితే.. గ్రామాలకు 16 పైసలే చేరుతోందని గతంలో ఓ ప్రధాని వాపోయారు. ఇప్పుడు రూపాయి పంపితే గ్రామానికి రూపాయి అందుతోంది అని తెలిపారు ప్రధాని మోడీ.