దంతాలను బట్టి ఆరోగ్యం ఎలా ఉందో చెప్పొచ్చు అంటే నమ్మొచ్చు కానీ.. దంతాల ఆకృతిని బట్టి ఒక మనిషి అదృష్టవంతుడా అతని భవిష్యత్తు, వ్యక్తిత్వం ఎలా ఉంటుందో కూడా చెప్పొచ్చు అని మీకు తెలుసా..? సాముద్రికా శాస్త్రంలో దంతాల అమరిక గురించి ఏలాంటి వివరణలు ఉన్నాయో మనం ఈరోజు చూద్దాం.
సాముద్రికా శాస్త్రాన్ని అనుసరించి తెల్లగా అందమైన దంతాలున్న వారు అదృష్టవంతులు. ఈ వ్యక్తుల స్వభావం స్నేహశీలమైనదట. ఉల్లాసంగా ఉంటుంది. అందరితోనూ సామరస్యంగా జీవిస్తారు. ఇదే వారిని సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలబెడుతుంది. వీరిది పోరాట పటిమ కలిగిన వారిగా చెప్పవచ్చు.
చిగుళ్లు మందంగా బలంగా కనిపించే వ్యక్తి కాస్త అహంకారంతో ఉండే అవకాశం ఉంటుంది.
గులాబిరంగు చిగుళ్లు కలిగిన వ్యక్తి మర్యాద కలిగిన వ్యక్తి. వీరికి ఆయుష్షు కూడా ఎక్కువగా ఉంటుందట..
కాస్త పసుపు పచ్చని షేడ్‌లో దంతాలు ఉండేవారు చాలా నమ్మకమైన వ్యక్తులు. వీరిని సులభంగా నమ్మవచ్చు. స్నేహపూరిత మనస్తత్వం కలిగిన వారు.
వంకర టింకరగా, ఎగుడు, దిగుడు దంతాలు ఉన్నవారు జీవితంలో కొన్ని అవకాశాలను కోల్పోతారని చెప్పేందుకు నిదర్శనం.
పొడవైన దంతాలు కలిగిన వారు అనుభవజ్ఞులు, చాలా పరిణతితో ఆలోచిస్తారు. చాలా ధైర్యవంతులు, దేనికి వెరవని వ్యక్తిత్వం వీరిది. ఆత్మవిశ్వాసం అధికంగా కలిగి ఉంటారు. వారి పని చేసే శైలి చాలా భిన్నంగా ఉంటుంది.
సాముద్రిక శాస్త్రం ప్రకారం దంతాలు సమంగా పైకి లేచినట్టు ఉండి సరళ రేఖలో మృదువుగా అమరినట్టు ఉన్న వ్యక్తికి జీవితంలో డబ్బుకు లోటుండదు. లక్ష్మీ దేవి ఆశిస్సులు సదా వీరి మీద ఉంటాయి.
దంతాల మధ్య అంతరం (గ్యాప్) ఉన్న వ్యక్తులు తెలివైన వారై ఉంటారు. ఈ వ్యక్తులు ఎదుటి వ్యక్తి దగ్గర నుంచి పని చేయించుకోవడంలో నైపుణ్యులు. వీరు ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గని మనస్తతత్వం కలిగిన వారు. ప్రతి సందర్భంలో ఏ విధంగా వారు సంతోషంగా ఉండాలనేది మాత్రమే వారు చూసుకుంటారు. వీరి వ్యక్తిత్వ ప్రభావం వీరితో ఉండేవారి మీద తప్పకుండా ఉంటుంది. ఓపెన్ మైండెడ్‌గా ఉంటారు. తినడం, తాగడం ఎల్లప్పుడూ పార్టీ మూడ్‌లో ఉంటుంటారు. కేరీర్లో చాలా త్వరగా నిర్ణయాలు తీసుకుంటారు. అంతేకాదు వారి నిర్ణయాలు సరైనవిగా ఉంటాయి. అందువల్ల వీరి వృత్తి జీవితం చాలా విజయవంతంగా ఉంటుంది.