హిందూ సంప్రదాయంలో పూజ భజనల చివరలో భగవంతుడికి హారతి ఇవ్వడం ఒక ముఖ్యమైన ఆచారం హారతిని ఎప్పుడు గడియారపు ముల్లు దిశలో సవ్య దిశలో తిప్పుతారు. దీని వెనుక ఒక సాధారణ కారణం మాత్రమే కాక లోతైన ఆధ్యాత్మిక శాస్త్రీయ కారణాలు దాగి ఉన్నాయి. భగవంతుడికి హారతి ఇవ్వడం అంటే కేవలం ఒక తంతుకాదు ఇది విశ్వశక్తితో అనుసంధానం కావడానికి ఒక మార్గం. మరి మనం హారతి సవ్య దిశలో ఎందుకు తిప్పుతారో తెలుసుకుందాం..
సవ్య దిశలో ప్రదక్షిణ చేయడం లేదా హారతి ఇవ్వడం అనేది సౌర వ్యవస్థ యొక్క ప్రయాణాన్ని అనుకరిస్తుంది. భూమి తన అక్షం మీద మరియు సూర్యుని చుట్టూ గడియారపు ముల్లు దిశలో తిరుగుతుంది. ఈ దిశలో హారతిని తిప్పడం వల్ల విశ్వంలో ఉండే సానుకూల శక్తిని మనం ఆకర్షిస్తామని నమ్ముతారు. ఇది భగవంతునితో మన అనుబంధాన్ని మరింత బలపరుస్తుంది.

అహంకారం తొలగింపు: హారతిలో వెలిగే దీపం భగవంతుని తేజస్సును సూచిస్తుంది. హారతిని సవ్య దిశలో తిప్పుతూ భగవంతుని రూపంలో లీనం కావడం ద్వారా మనలో అహంకారం నెగిటివ్ ఆలోచనలు తొలగిపోతాయని నమ్ముతారు. ఇది మన మనసును శుద్ధి చేసి మనలో మంచి లక్షణాలను పెంచేందుకు సహాయపడుతుంది.
బ్రహ్మాండ శక్తిని ఆకర్షించడం: హిందూ ధర్మంలో ప్రతి శుభకార్యం సవ్య దిశలో ప్రారంభమవుతుంది. ఈ దిశను ప్రదక్షణ అని అంటారు. ఆలయాలలో కూడా మనం ప్రదక్షణలను సవ్య దిశలో చేస్తాం ఇది మనకు బ్రహ్మాండంలోని సానుకూల శక్తిని అందిస్తుంది.
పవిత్ర వాతావరణం: హారతిలో వెలిగించే కర్పూరం లేదా దీపం నుండి వచ్చే వెలుతురు మరియు సుగంధం వాతావరణాన్ని శుద్ధి చేస్తాయి. ఈ చర్య వల్ల మన మనసు ప్రశాంతంగా మారుతుంది.
హారతి సవ్య దిశలో (గడియారపు ముల్లు దిశ) తిప్పడం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం విశ్వశక్తితో అనుసంధానం కావడం అహంకారాన్ని తొలగించడం. మన చుట్టూ ఉన్న వాతావరణ శుద్ధి చేసుకోవడం ఈ ఆచారం మనకు ఆధ్యాత్మికంగా మానసికంగా బలం ఇస్తుంది. పూజ తర్వాత హారతి ఇవ్వడం అంటే కేవలం ఒక తంతుకాదు భగవంతుడికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మనల్ని మనం ఆయనకు సమర్పించుకోవడం.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం ఆధ్యాత్మిక నమ్మకాల ఆధారంగా ఇవ్వబడింది. ప్రతి ఒక్కరి నమ్మకాలు ఆచారాలు భిన్నంగా ఉండవచ్చు.