గణేష్ నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇప్పటికే కొన్ని ప్రాంతాలలో గణేశుడి నిమజ్జనం జరిగింది. గణేశుడు నిత్యం పూజలు అందుకున్నాడు. పూలు పండ్లు పలహారాలతో గణేశుడికి భక్తులు ఎంతో ఇష్టంగా పూజించారు. ఇక నిమజ్జనానికి ముందు గణేశుడి వద్ద పెట్టిన లడ్డుకు వేలం వేస్తారు. ప్రతి ఒక్కరూ గణపతి వద్ద పెట్టిన లడ్డూను దక్కించుకోవడానికి ఎంతో ఆరాటపడతారు.

ప్రతి గణపతి వద్ద లడ్డును పెట్టి వేలం వెయ్యగా భక్తులు ఎంత ఖర్చు అయినా సరే వేలం వేసి వారు దక్కించుకుంటారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ లో లడ్డుకు రికార్డు ధర పలికింది. హైదరాబాద్ లోని మాదాపూర్ లో మై హోమ్ భుజా అపార్ట్మెంట్ లో వినాయకుడి లడ్డూ వేలంలో రికార్డు ధర పలకడం విశేషం. రూ. 51,07,777 కు ఇల్లందుకు చెందిన ఓ రియల్ ఎస్టేట్ సంస్థ అధినేత గణేష్ ఈ లడ్డూను దక్కించుకున్నారు. గత సంవత్సరం కూడా ఇతనే రూ. 29 లక్షలకు లడ్డు దక్కించుకోగా ఈ సంవత్సరం రికార్డు ధర పలికి లడ్డును దక్కించుకున్నారు.
రాయదుర్గం మైహోమ్ భుజాలో రికార్డు ధర పలికిన గణేష్ లడ్డు
రూ.51,77,777 లక్షలు పలికిన వినాయకుడి లడ్డు https://t.co/8oP1DWta2q pic.twitter.com/3zGNaYwnva
— Telugu Scribe (@TeluguScribe) September 4, 2025