మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం భారతీయ పురాణాల్లో అత్యంత ముఖ్యమైన ఘట్టం. ఈ భీకర పోరాటం గురించి మనందరికీ తెలుసు కానీ యుద్ధం ఎన్ని రోజులు జరిగిందనే విషయంపై చాలామందికి స్పష్టత ఉండకపోవచ్చు. కొందరు ఒక వారం, మరికొందరు నెలలు అనుకుంటారు. అయితే మహాభారత గ్రంథం ప్రకారం ఈ మహా యుద్ధం కేవలం కొన్ని రోజులే సాగింది. మరి ఆ రోజులు ఎన్ని? ఆ సమయంలో ఏం జరిగింది? అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం కేవలం ఒక పోరాటం కాదు, అది ధర్మం అధర్మం మధ్య జరిగిన ఒక మహాసంగ్రామం. ఈ యుద్ధం ఆరంభంలో తన బంధువులపై యుద్ధం చేయడానికి వెనుకాడిన అర్జునుడికి శ్రీకృష్ణుడు భగవద్గీత బోధించి కర్తవ్యాన్ని గుర్తు చేశాడు. ఈ సంభాషణ కేవలం తత్వ బోధన మాత్రమే కాదు ఒక గొప్ప యుద్ధానికి నాంది పలికింది.
మహాభారత ఇతిహాసం ప్రకారం కురుక్షేత్ర యుద్ధం మొత్తం 18 రోజులు సాగింది. ఈ 18 రోజుల్లో ప్రతిరోజు ఉదయం సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు యుద్ధం సాగేది. రాత్రి సమయంలో యోధులు విశ్రాంతి తీసుకొని మరసటి రోజు యుద్ధానికి సిద్ధమయ్యేవారు. ఈ యుద్ధంలో అనేకమంది మహారధులు సైనికులు, రాజులు, తమ ప్రాణాలను కోల్పోయారు. ఈ 18 రోజుల యుద్ధంలో జరిగిన ముఖ్యమైన సంఘటనలను తెలుసుకోవడం ముఖ్యం.

మొదటి 10 రోజులు భీష్ముడు, కౌరవ సైన్యానికి సేనాధిపతిగా వ్యవహరించాడు. ఆయన ప్రతిరోజు పాండవుల సైన్యానికి తీవ్రమైన నష్టం కలిగించారు. ఈ దశలో అర్జునుడు శిఖండిని అడ్డుపెట్టి భీష్ముడిని అంపశయ్యపై పడవేశాడు.
ఇక 11వ రోజు నుండి 15 రోజులపాటు ద్రోణాచార్యుడు కౌరవ సైన్యానికి సేనాధిపతిగా బాధ్యతలు స్వీకరించాడు. ఆయన యుద్ధాన్ని మరింత భీకరంగా మార్చాడు ఈ సమయంలో అభిమన్యుడు చక్ర వ్యూహంలో వీరమరణం పొందాడు. ఇక 16వ రోజు కర్ణుడి సేనాధిపతిగా బాధ్యతలు తీసుకున్నాడు అప్పుడు అర్జునుడు, కర్ణుడు మధ్య భయంకరమైన పోరాటం జరిగింది. చివరికి కర్ణుడు ప్రాణాలు కోల్పోయాడు.
ఇక చివరి రోజులైన 17వ రోజు, 18వ రోజు ఎంతో ఉత్కంఠంగా యుద్ధం సాగింది. శల్యుడు సేనాధిపతిగా వ్యవహరించాడు. ఆరోజు భీముడు, దుర్యోధుడిని తొడలు పడగొట్టి అతడిని ఓడించాడు. ఇక చివరి 18వ రోజు అశ్వద్ధామ, కృపాచార్యుడు, కృతవర్మ మాత్రమే కౌరవ సైన్యం తరుపున బ్రతికారు.ఇక 18 వ రోజు దుర్యోధనుడు ప్రాణాలను కోల్పోయాడు.
కురుక్షేత్ర యుద్ధం మొత్తం 18 రోజులు మాత్రమే జరిగింది. ఈ కాలంలో భీముడు, ద్రోణుడు, కర్ణుడు వంటి గొప్ప యోధులు తమ నైపుణ్యాలను ప్రదర్శించారు. చివరికి ఈ మహా యుద్ధం శ్రీకృష్ణుడి సహకారంతో పాండవుల విజయంతో ముగిసింది.