రైతులు సీజన్లతో సంబంధం లేకుండా ఎల్లప్పుడు పని చేస్తూ ఉంటారు. దేశానికి అన్నం పెట్టాలనే కృషి, పట్టుదలతో కష్టపడతారు. రైతు లేకపోతే ఈ దేశానికి అన్నం దొరకడం చాలా కష్టం. చాలామంది రైతులు సీజన్లతో సంబంధం లేకుండా చాలా కష్టపడి పని చేస్తున్నారు. తాజాగా ఓ మహిళా రైతు పనితీరు పట్ల నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

వ్యవసాయ పనులకు వెళ్లిన ఓ మహిళ వరి నాటు వేసేందుకు వచ్చింది. ఆ మహిళా రైతు తనతో పాటు తన పసిబిడ్డను కూడా వెంట తీసుకొని వచ్చింది. ముద్దాగారే ఆ పసిపాపను ఓ పాత్రలో పడుకోబెట్టి నారుమడిలో ఆడిస్తూ పనిచేసింది. ఓ వైపు ఎంతో చాకచక్యంగా పనిచేస్తూ మరోవైపు తన పసిపాపను అల్లారు ముద్దుగా ఆడిస్తూ ముచ్చటిస్తూ మురిసిపోతూ పనిచేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. ఆ మహిళా రైతును చూసి ప్రతి ఒక్కరూ ఎంతగానో మెచ్చుకుంటున్నారు. పని పట్ల తనకు ఉన్న పట్టుదలను చూసి ఎంతగానో పొగుడుతున్నారు.
View this post on Instagram