అల్లు అర్జున్ ను కలిశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ సందర్భంగా అల్లు అరవింద్ తల్లి అల్లు కనకరత్నమ్మ గారికి నివాళులు అర్పించి, కుటుంబాన్ని పరామర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అంతకు ముందు…అల్లు అరవింద్ తల్లి అల్లు కనకరత్నమ్మ గారికి నివాళులు అర్పించి, కుటుంబాన్ని పరామర్శించారు పవన్ కళ్యాణ్. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి.

ఇది ఇలా ఉండగా.. కాసేపటి క్రితమే.. తెలంగాణ భవన్ లో కేటీఆర్ ్రపెస్ మీట్ పెట్టారు. ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో మేము పాల్గొనడం లేదని తెలిపారు కేటీఆర్. తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు కొట్టుకుంటున్నారు.. ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ ఈ రాష్ట్ర రైతాంగాన్ని వేధిస్తున్నారని ఆగ్రహించారు కేటీఆర్. 20 రోజుల కిందట మేము హెచ్చరించినా కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు, రాష్ట్రప్రభుత్వం స్పందించలేదు.. అందుకే 70 లక్షల రైతన్నల తరుపున మేము ఎన్నికలు బహిష్కరించామని స్పష్టం చేశారు.