సాధారణంగా మనం వినాయకుడిని పురుష రూపంలో పూజిస్తాము. కానీ హిందూ పురాణాల్లో గణనాథుడికి స్త్రీ రూపం కూడా ఉందని తెలుసా? ఆ రూపమే ‘విఘ్నేశ్వరి’దేవి. సర్వ విజ్ఞానము తొలగించే వినాయకుడి శక్తికి ప్రతీక. ఈ రూపం వెనుక అద్భుతమైన ఆధ్యాత్మిక రహస్యాలు దాగి ఉన్నాయి. విఘ్నేశ్వరి మనకు జ్ఞానాన్ని, శక్తిని సమగ్రతను బోధిస్తుంది. ఈ శ్రీ రూపం మనలోని అంతర్గత శక్తులను ఎలా మేల్కొనవచ్చు సూచిస్తుంది. ఈ అరుదైన శక్తివంతమైన రూపం గురించి మరింత సమాచారం తెలుసుకుందాం..
విఘ్నేశ్వరి ఆవిర్భావం : విఘ్నేశ్వరి ఆవిర్భావం గురించి అనేక పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి . దేవీ, దేవతల మధ్య జరిగిన ఒక యుద్ధంలో దేవతలు విజయం సాధించడానికి గణపతి శక్తి అవసరమైంది. అప్పుడు గణపతి తన శ్రీ శక్తిని విఘ్నేశ్వరి రూపంలో ఆవిష్కరించారు. ఆమె శత్రువులను సులభంగా ఓడించి, విజ్ఞలను తొలగించి దేవతలకు విజయాన్ని అందించింది. ఈ కథ విఘ్నేశ్వరి అనే రూపం కేవలం ఒక దేవత మాత్రమే కాదని, అది గణపతి శక్తికి, ఆదిశక్తికి ప్రతీక అని వివరిస్తుంది.
విఘ్నేశ్వరి రూపంలో ఆధ్యాత్మిక అర్థం : పురుష గణపతి మాదిరిగానే విఘ్నేశ్వరి కూడా ఏనుగు తలను కలిగి ఉంటుంది. జ్ఞానం, వివేకం అంతర్గత శక్తికి ఈమె ప్రతీక. ఈ రూపం మనకు జ్ఞానం అనేది స్త్రీ, పురుష భేదం లేకుండా ఎవరిలోనైనా ఉండొచ్చని బోధిస్తుంది.

విగ్నేశ్వరి రూపం స్త్రీ శరీర లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది శక్తి పోషణ సృజనాత్మకతకు ప్రతీక విఘ్నేశ్వరీ రూపంలో మనం స్త్రీ శక్తులు ఎంత శక్తివంతమైనవో అవి విజ్ఞాలను ఎలా తొలగించవచ్చో చూస్తాము.
శంఖం, పద్మం, విఘ్నేశ్వరి అమ్మవారి చేతుల్లో కలిగి వుంటుంది. శంఖం విజయానికి విజ్ఞానం తొలగించడానికి ప్రతీక పద్మం పవిత్రతను ఆధ్యాత్మికత పెరుగుదలకు ప్రతీక. ఆమె తన భక్తులకు జ్ఞానాన్ని విజయాన్ని అందిస్తుందని ఇది సూచిస్తుంది.
విఘ్నేశ్వరీ రూపం గణపతి లోని శ్రీ శక్తిని, ఆదిశక్తి స్వరూపాన్ని సూచిస్తుంది. ఆమె జ్ఞానం, శక్తి సృజనాత్మకత పోషణకు, ప్రతీక. ఈమెను పూజించడం ద్వారా మనం మనలోని స్త్రీ శక్తులను మేల్కొల్పవచ్చని, విజ్ఞాలను అధిగమించి, జీవితంలో విజయాన్ని సాధించవచ్చని ఈ రూపం మనకు బోధిస్తుంది. ఈ అద్భుతమైన రూపం గురించి గణపతి నవరాత్రుల్లో తెలుసుకోవడం ఎంతో మధురం. తమిళనాడులోని సుచీంద్రంలో గణనాథుడిని గణేశ్వరిగా చూడవచ్చు.