అనుష్కకు సీక్రెట్ గా ఫోన్ చేసిన టాలీవుడ్ హీరో… ఆడియో వైరల్

-

అనుష్క శెట్టి నటించిన తాజా చిత్రం “ఘాటీ”. ఈ సినిమా ఈనెల 5వ తేదీన రిలీజ్ కానుంది. కాగా ఈ సినిమా ప్రమోషన్లను శరవేగంగా జరుపుతున్నారు. ఈ క్రమంలోనే హీరో రానా, అనుష్క మాట్లాడుకున్న కాల్ రికార్డింగ్ వైరల్ గా మారుతుంది. సినిమా గురించి వీడియోలు రిలీజ్ చేయడం చాలా కామన్ అయిపోయిందని ఇలా వినూత్నంగా ఆడియోని రికార్డ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇలాంటి కథలకు అనుష్కను తప్ప ఇంకెవరిని పెడతారు వాళ్లకు ఆప్షన్ లేదు అంటూ రానా మాట్లాడారు.

ANUSHKA
ANUSHKA

కాగా, నటి అనుష్క శెట్టి ఆరోగ్యం బాగోలేకపోవడం వల్లనే ప్రమోషన్స్ కార్యక్రమాలలో పాల్గొనడం లేదని తెలుస్తోంది. చాలా రోజుల తర్వాత అనుష్క శెట్టి మరో సినిమాతో తన అభిమానుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఒకానొక సమయంలో టాలీవుడ్ సినీ పరిశ్రమలోనే స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పింది. ఇప్పుడు సినీ పరిశ్రమలోకి కొత్త హీరోయిన్ రావడంతో అనుష్క శెట్టి హవా కాస్త తగ్గిందనే చెప్పవచ్చు. సినిమాలకు దూరంగా ఉంటున్నప్పటికీ సోషల్ మీడియాలో తన అభిమానులతో ఎప్పుడు చేరువలోనే ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news