విష్ణు సహస్రమానాలలో ఈ శ్లోకాలు చదివితే తీరని కోరిక ఉండదు

-

సనాతన ధర్మంలో అనేకానేక పద్ధతులు. ప్రజలు సుఖసంతోషాలతో ఉండటానికి అనేక ఉపాయాలను, పరిహారాలను అందించిన ధర్మం. భక్తితో, నియమనిష్టలతో ఆచరిస్తే తప్పక ఫలితాలు కలుగుతాయి. సులభంగా ఖర్చులేకుండా చేసుకునే పవర్‌పుల్ పరిహారాలను తెలసుకుందాం.. విష్ణుసహస్రనామాలు అనేవి చాలా విశేషమైనవి. వేదాలలో భగవంతుడి నామాలను అన్ని ఒక్కచోట చేర్చిన విశేష స్తోత్రం ఇది. భీష్మపితామహుడు చెప్పని ఈ నామాలు చాలా శక్తివంతమైనవి. వీటిలో ఆయా శ్లోకాలు చదివితే ఆయా ఫలితాలు వస్తాయి. వాటి విషయాలు తెలుసుకుందాం… ఈ శ్లోకాలు చదివితే ఏం ఫలమో కొన్నింటి గురించి …

పిల్లల క్షేమార్థము తల్లిదండ్రులు జపము చేయవచ్చును:
1. విద్యాభివృద్ధికి : 14వ శ్లోకం.
సర్వగ సర్వవిద్భాను ర్విష్వక్సేనో జనార్దనః |
వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్కవిః ||

2. ఉదర రోగ నివృత్తికి:- 16వ శ్లోకం.
భ్రాజిష్ణు ర్భోజనం భోక్తా సహిష్ణు ర్జగదాదిజః |
అనఘో విజయో జేతా విశ్వయోనిః పునర్వసుః ||

3. ఉత్సాహమునకు:- 18వ శ్లోకం.
వేద్యో వైద్య స్సదాయోగీ వీరహా మాధవో మధుః |
అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః ||

4. మేధాసంపత్తికి:- 19వ శ్లోకం.
మహాబుధ్ధి ర్మహావీర్యో మహాశక్తి ర్మహాద్యుతిః |
అనిర్దేశ్య వపుః శ్రీమా నమేయాత్మా మహాద్రిధృక్ ||

5. కంటి చూపునకు:- 24వ శ్లోకం.
అగ్రణీ గ్రామణీ శ్రీమాన్ న్యాయో నేత సమీరణః |
సహస్రమూర్థా విశ్వాత్మ సహస్రాక్ష స్సహస్రపాత్ ||

6. కోరికలిడేరుటకు:- 27వ శ్లోకం.
అసంఖ్యేయో2ప్రమేయాత్మ విశిష్ట శ్శిష్ట క్రుచ్ఛిచిః |
సిద్ధార్థ స్సిధ్ధసంకల్పః సిద్ధిద స్సిధ్ధిసాధనః ||

7. వివాహ ప్రాప్తికి:- 32వ శ్లోకం.
భూతభవ్య భవన్నాధః పవనః పావనో2నలః |
కామహా కామక్రుత్కాన్తః కామః కామప్రదః ప్రభుః ||

8. అభివృద్ధికి:- 42వ శ్లోకం.
వ్యవసాయో వ్యవస్థానః సంస్థాన స్స్థానదో ధ్రువః |
పరర్థిః పరమ స్పష్ట: స్తుష్ట: పుష్ట శ్శుభేక్షణః ||

9. మరణ భీతి తొలగుటకు:- 44వ శ్లోకం.
వైకుంఠ: పురుషః ప్రాణః ప్రాణదః ప్రణవః ప్రుథుః |
హిరణ్యగర్భః శత్రుఘ్నో వ్యాప్తో వాయు రథోక్షజః ||

10. కుటుంబ ధనాభివ్రుద్ధికి:- 46వ శ్లోకం.
విస్తారః స్థావర స్స్తాణుః ప్రమాణం బీజ మవ్యయం!!
ఈ పై శ్లోకాలను పొద్దున్నే శుచి, శుభ్రతతో భక్తి శ్రద్ధలతో నిత్యం పారాయణం చేస్తే తప్పక ఆయా ఫలితాలు కలుగుతాయి. ఇది ఆచరించి ఎంతోమంది ప్రయోజనం పొందారు.

– శ్రీ

Read more RELATED
Recommended to you

Latest news