ఇంట్లో లక్ష్మీదేవి కూర్చొని ఉన్న ఫొటోను పెట్టి ఆరాధించాలి. వారానికి ఒక్కసారైనా ఆ ఫొటోను శుభ్రమైన వస్త్రంతో తుడిచి గంధం, పసుపు, కుంకమతో అలంకరించాలి. ప్రతిరోజు ఒక్క అగరువత్తి వెలిగించి అమ్మవారికి నమస్కారం చేస్తుండాలి. రావిచెట్టుకు శనివారం, మంగళవారం పాలు, నీళ్లు, బెల్లం కలిపి పోసి విష్ణుమూర్తిని ప్రార్థించాలి. తండ్రీ వృక్షాలలో అశ్వత్థవృక్షమని చెప్పావు.
నీ పాదాల చెంత నేను అర్ఘ్యం వదిలాను దయవుంచి నా ఉద్యోగం/వ్యాపారంలో ఉన్న సమస్యలు తీర్చి ధన సంపదలను అభివృద్ధి చేయిస్వామి అని ప్రార్థించాలి. పూజాగదిలో రాగిచెంబులో గంగాజలాన్ని ఉంచండి, లక్ష్మీ ప్రదంగా శాస్ర్తాలు చెపుతున్నాయి. పై చిట్కాలను విశ్వాసంతో ఆచరిస్తే తప్పక లక్ష్మీ, నారాయణల అనుగ్రహం కలిగి మీ ధన సంపదలు వృద్ధి చెందుతాయి. ఈ విషయాలు ఆయా పురాణేతిహాస గ్రంథాలలో ఉన్నాయి.
– కేశవ