గవ్వలని లక్ష్మీ దేవిగా ఎందుకు భావిస్తారంటే….!

-

ముఖ్యంగా వాస్తు శాస్త్రాన్ని నమ్మేవారు కొంత మంది మన ఇంట్లో గవ్వలను ఉంచుకోవడం శుభంగా పరిగణిస్తారు. మరి కొందరైతే ఇళ్లల్లో గవ్వలని ఉంచకూడదని అంటూ ఉంటారు. అయితే గవ్వలను లక్ష్మీ దేవి స్వరూపంగా భావిస్తారని గవ్వలు ఇంట్లో ఉండటం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. మరి పూర్తిగా ఇప్పుడే చూసి తెలుసుకోండి. మన పురాణాల ప్రకారం గవ్వలు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. అందుకే గవ్వలను ఇంట్లో పెట్టుకొని పూజిస్తారు. ఇలా పూజించడం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువై ఉంటుందని అంటూంటారు.

మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే..? పూర్వం అమృతం కోసం రాక్షసులు, దేవతలు సాగర మధనం చేస్తున్నప్పుడు సముద్ర గర్భం నుంచి లక్ష్మీ దేవి, కల్పవృక్షం, కామదేనువు వంటివి ఉద్భవిస్తాయి. గవ్వలు కూడా సముద్రంలో ఉంటాయి కాబట్టి గవ్వలను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. దీని మూలం గానే పూజ గదిలో ఉంచుకొని పూజ చేయడం ద్వారా లక్ష్మి దేవత కొలువై ఉంటుందని మనం చెప్పొచ్చు. అలానే పురాతన కాలం నుంచి దీపావళి రోజున గవ్వలను ఆడటం ఆనవాయితీగా పాటించడం జరుగుతోంది. అయితే పసుపు రంగులో ఉండే గవ్వలను పూజించడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చని పండితులు తెలియజేస్తున్నారు.

ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కుదరని వారు గవ్వలను జేబులో పెట్టుకోవటం వల్ల పెళ్లి ఘడియలు దగ్గర పడతాయి. నల్లటి దారంలో ఈ గవ్వను వేసుకొని మెడలో కట్టుకోవడం ద్వారా ఎటువంటి నరదృష్టి తగలదని అంటారు. వ్యాపారాలు చేసేవారు తెల్లటి వస్త్రము లో ఉంచి డబ్బులు పెట్టే చోట గవ్వలను పెట్టడం వల్ల వ్యాపార అభివృద్ధి జరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news