భారతీయం అంటేనే రామాయణం. రామాయణం అంటేనే సీతారాముల దివ్యకథామఋతం. ఆ ఆదర్శ దంపతులు లోకకళ్యాణం కోసం జన్మించిన విషయం అందిరికీ విదితమే. సీతమ్మ అయోనిజ. అంటే మానవ గర్భంలో పెరిగి పెద్దదైనది కాదు. మిథిలా నగరాన్ని పరిపాలించే మహాచక్రవర్తి జనక మహారాజు సంతానం కోసం యాగం నిర్వహించిన సమయంలో భూమిని దున్నుతుండగా ఒక పెట్టెలో జానకీ మాత దొరికింది. ఈ రాజ్యానికి పేరు విదేహీ. అందుకే సీతమ్మను వైదేహీ అని కూడా పిలుస్తారు. అయితే మిథిలా నగరం ప్రస్తుతం నేపాల్ దేశంలో ఉంది. విశ్వామిత్రుని దగ్గర అస్త్ర శస్త్ర విద్యలను నేర్చుకున్న తర్వాత విశ్వామిత్రునితో కలిసి రామలక్ష్మణులు మిథిలానగరానికి వస్తారు. ఇక్కడే రాముడు శివధనస్సు భంగం చేస్తాడు. దాంతో జనకమహారాజు తన పుత్రిక సీతమ్మను వివాహమాడమని ప్రార్థిస్తాడు. కానీ తండ్రి ఆజ్ఞలేనిదే నేను వివాహం చేసుకోనంటాడు రామచంద్రడు. దాంతో తల్లిదండ్రులకు కబురు పంపగా వారు వస్తారు. అనంతరం రెండు కుటంబాలు అన్నింటిని సరిచూసుకుని రాజపురోహితుల మధ్య సంబంధాన్ని ఖాయం చేసుకుంటారు. తర్వాత పాల్గుణ మాసంలో మిథిలా నగరంలో అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణంతోపాటు లక్ష్మణ, భరత, శతఋఘ్నుల కళ్యాణాన్ని చేస్తారు. అయితే ఈ నగరం ప్రస్తుతం నేపాల్‌లో ఉంది. కాలక్రమేణా చరిత్ర శిథిలమైపోయింది. 1967లో ఒక సన్యాసికి ఇక్కడ సీతాదేవి విగ్రహాలు లభించడంతో తిరిగి చరిత్రను పదిలపర్చాలన్న సంకల్పంతో నేపాల్ రాణి వఋషభాను జానకీ మందిర్‌ను నిర్మించింది. ఇక్కడ ఒక పెద్ద ఆలయాన్ని నిర్మించారు. 150 అడుగుల ప్రాకారంతో నౌ లాఖ్ మందిర్‌ను నిర్మించారు. ఈ మందిర నిర్మాణానికి తొమ్మిది లక్షలు ఖర్చు అయ్యాయి. కాబట్టి దీన్ని నౌలాఖ్ మందిర్ అంటారు. నేపాల్‌కు వెళ్లినప్పుడు తప్పక మిథిలా నగరాన్ని చూసిరండి. సీతారాముల కటాక్షానికి పాత్రులు కండి. ఓం నమో సీతారామచంద్రాయనమః
-కేశవ