సూర్యాపేట పట్టణానికి చెందిన బుర్ర క్రాంతి వెల్డింగ్ పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. 6నెలల కిందట సొంతంగా పాన్ డబ్బా నడిపించుకుంటానంటూ శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి దగ్గర రూ.6 వేలు అప్పు తెచ్చాడు. శ్రీకాంత్ రెడ్డి తన డబ్బును తిరిగి చెల్లించమంటూ క్రాంతిని అడగగా క్రాంతి చెల్లించలేదు. దీంతో శ్రీకాంత్ రెడ్డి, నవీన్‌తోపాటు మరికొందరు ఈనెల 4న క్రాంతిపై దాడి చేయగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు.
సూర్యాపేట: ప్రాణం తీసిన రూ.6 వేల వివాదం
-