SRCL: ఆన్లైన్లో విక్రయం పేరిట మోసం చేసిన ఇద్దరిని అరెస్టు చేసినట్లు సిఐ అనిల్ కుమార్ తెలిపారు. సిరిసిల్లకు చెందిన కొండ రంజిత్, కొండ రాజులు ఆన్లైన్లో అమ్మకానికి పెట్టిన సెల్ ఫోన్లను కొంటామని చెప్పి సిరిసిల్లకు పిలిపించుకుని మోసం చేశారన్నారు. వారిని పట్టుకొని 4 సెల్ ఫోన్లు, 2 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకొని రిమాండ్కు పంపించినట్లు సీఐ పేర్కొన్నారు.