కొడంగల్ మండల పరిధిలోని రుద్రారంలో ఆయుర్వేద వైద్యశాల పదేళ్లుగా మూత పడింది. సిబ్బంది లేకపోకవడం వల్ల వైద్య సేవలు అందడం లేదు. ఆయుర్వేద ఆస్పత్రులపై ప్రభుత్వం చిన్ని చూపు చూస్తోందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పేదలకు మేలు చేసే విధంగా రుద్రారం ఆస్పత్రిని ప్రారంభించాలని కోరుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి వైద్య సిబ్బందిని నియమించాలి. గ్రామంలోని ఆయుర్వేద వైద్యశాలకు పూర్వ వైభవం కల్పించాలన్నారు