భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్సనల్ సెక్రటరీ పీకే మిశ్రా కూతురు, అల్లుడిని అని చెప్పుకుని బడా బడా వ్యక్తులను మోసం చేసిన నిందితులను ఒడిశా పోలీసులు ఇటీవల భువనేశ్వర్‌లో అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. నిందితులను హన్సితా అభిలిప్సా (38), ఆమె సహచరుడు అనిల్ కుమార్ మొహంతిగా గుర్తించారు.
కేంద్ర ప్రభుత్వం తరఫున కాంట్రాక్టులు ఇప్పిస్తామని చెప్పి ఈ నిందితులు పారిశ్రామిక, వ్యాపారవేత్తలను మోసం చేసినట్లు సమాచారం. సుమారు రూ.100 కోట్లకు పైగా టోకరా వేసినట్లు విచారణలో తేలింది. ఎవరికీ చిక్కకుండా లగ్జరీ కార్లు, విల్లాల్లో వీరిద్దరూ ఎంజాయ్ చేసినట్లు తెలిసింది.బాధితుల ఫిర్యాదుల మేరకు రంగంలోకి దిగిన ఓడిశా పోలీసులు హన్సిక,అనిల్ కుమార్‌ను అరెస్ట్ చేసి విచారించగా.. వారిచ్చిన సమాచారం మేరకు ఏపీ, తెలంగాణలోని నాలుగు చోట్ల ఐటీ అధికారులు అధికారులు ఏక కాలంలో సోదాలు చేస్తున్నారు.