
రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం శివంగలపల్లి గ్రామానికి చెందిన పుట్ట అనంతరెడ్డి అనే రైతుకు చెందిన జెర్సీ ఆవుపై బుధవారం అర్ధరాత్రి చిరుత పులి దాడి చేయడంతో ఆవు మృతి చెందింది. ఆవు చనిపోవడంతో రైతు అనంతరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు రూ.75 వేలు విలువ గల ఆవు చనిపోయిందన్నారు. కాగా చిరుత సంచారంపై రైతులు, స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు.