చేవెళ్ల: మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు వెల్లడించారు. ప్రస్తుతం స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నందున క్వారంటైన్‌లో ఉంటున్నానని తెలిపారు. కొద్దిరోజుల క్రితం తనను కలిసిన వారు పరీక్షలు నిర్వహించుకోవాలని కోరారు. ఒమిక్రాన్ అంత ప్రమాదకరమైనది కాదని ప్రతి ఒక్కరూ వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకోవాలని సూచించారు.