సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో ఆర్థిక మంత్రి హరీష్ రావు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్న సమయంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బుడగ జంగాల పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వలేదని, అనర్హులకు ఇస్తున్నారని మంత్రి కాన్వాయ్‌ని అడ్డుకునే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. అంతకుముందే మండల కాంగ్రెస్ పార్టీ నాయకులను అర్ధరాత్రి అరెస్టు చేసి చిన్నకోడూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.