ఉమ్మడి వరంగల్ జిల్లాలో శీతల గాలులతో చలి పెరిగింది. నాలుగు రోజుల నుంచి ఉదయం, సాయంత్రం వేళల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతూ వస్తుంది. దీంతో పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా చలి గజగజలాడిస్తుంది. ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో సరాసరిగా 9.4డిగ్రీలు నమోదైంది. హన్మకొండలో 10.1, వరంగల్ 10.4, జనగామ 10.5, మహబూబాబాద్ జిల్లాలో 12 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం 10 తర్వాతే జనం బయటికి వస్తున్నారు.