సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఆర్టీసీ బస్సులలో ప్రయాణించాలని, వారికి అవసరమైన అన్ని సదుపాయాలు ఎప్పటికప్పుడు కల్పిస్తున్నామని గోదావరిఖని ఆర్టీసీ డీఎం వెంకటేశం తెలిపారు. ‘డయల్ యువర్ ఆర్టీసీ డీఎం’ కార్యక్రమంలో ఆయన ప్రయాణికుల సమస్యలు, సూచనలను పరిగణలోకి తీసుకొని సమీక్షించారు. ప్రయాణికులను ఎప్పటికప్పుడు గమ్యస్థానాలు చేర్చేందుకు అన్ని రకాల ఏర్పాట్లను చేస్తున్నామన్నారు.