తెలంగాణలో 303 కేసుల్లోని 3558 కేజీల డ్రగ్స్ డిస్పోజల్ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్ స్టాన్సెస్ కింద పట్టుబడిన ఎన్‌డీపీఎస్ డ్రగ్స్ గంజాయిని జనవరి 10 నుంచి 25 లోపు డిస్పోజల్ చేపట్టాలని కేంద్ర హోం మంత్రిత్వశాఖ అదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం 2024 డిసెంబ రు 23న నోటిఫికేషన్ జారీ చేసింది. తెలంగాణలో కేంద్రం ఇచ్చిన ఆదేశాల మేరకు డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డైరెక్టర్ వి.బి.కమలాసన్‌రెడ్డి ఎక్సైజ్ శాఖలోని డిప్యూటి కమిషనర్లకు డిస్పోజల్‌కు అదేశాలు జారీ చేశారు.
జనవరిలో డైరెక్టర్ అదేశాల మేరకు తెలంగాణలోని ఎక్సైజ్‌శాఖ పరిధిలో ఉండే పది డివిజన్లలోని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లలో 303 కేసుల్లో పట్టుబ డిన 3558 కేజీల ఎన్‌డీపీఎస్ గంజాయి, డ్రగ్స్‌ను కాల్చివేశారు. కాల్చివేసిన డ్రగ్స్,గంజాయి విలువ రూ. 14.60 కోట్లుగా ఉంటుందని అంచనా వేశారు. తెలంగాణ కాలుష్య నియంత్రణ బోర్డు అనుమతి ఇచ్చిన కాల్చివేత కంపెనీల్లో మాత్రమే డ్రగ్స్, గంజాయిని దాహనం చేశారు. ఇంకా చేయాల్సింది 10,596 కేజీలు.. ఈ మొత్తాన్ని కూడ ఈ నెలలో పూర్తిగా డిస్పోజల్ చేయడానికి ఎక్సైజ్ అధికారులు కసరత్తు చేపట్టారు.