మాజీ మంత్రి హరీశ్ రావు పచ్చి అబద్ధాలు, అసత్యాలు జనంలోకి తీసుకువెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులపై తప్పుడు ప్రాపగండా చేస్తున్నారు. అద్భుతాలు చేస్తున్నట్లు కేసీఆర్, హరీష్ నటించారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ ఇరిగేషన్ కు తీరని అన్యాయం జరిగింది. లక్ష కోట్లు తెచ్చి కాళేశ్వరం కడితే వాళ్ళ టైమ్ లో కట్టిన ప్రాజెక్టు.. కూలిపోయింది. వారి పరిపాలనకు అదే అద్దం పడుతోంది.
ప్రతి విషయంలో అవగాహన లేకనో, అసమర్థతతోనో తీరని అన్యాయం చేసారు. అధికారం పోవడం హరీశ్ తట్టుకోలేక పోతున్నారు. బనకచర్ల ప్రాజెక్టుతో 200టీఎంసీ ఏపీ తరలించుకు పోతుందన్నారు. ఇప్పటి వరకు ఒక్క చుక్క ఏపీ తరలించలేదు. ఈ విషయంలో మేము చాలా అప్రమత్తంగా ఉన్నాం. బనకచర్ల విషయంలో మేము కేంద్రానికి, బోర్డులకు లేఖ రాశాము. బనకచర్ల నిర్మాణం చట్ట వ్యతిరేకం అని కేంద్ర మంత్రులకు తెలియజేసాం. కేఆర్ఎంబి, జిఆర్ఎంబికి లేఖ రాశాము. నిబంధనల కు విరుద్ధంగా నిర్మించ తలపెట్టిన బనకచర్లకు నిధులు కేటాయించవద్దని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు నేనే స్వయంగా లేఖ రాశా. వాటర్ డీస్ఫూట్స్ విషయంలో సెక్షన్ 3 కోసం స్వయంగా నేనే వాదనలు వినిపించా. తెలంగాణకు కేసీఆర్, హరీష్ ద్రోహం, దగా, మోసం చేశారు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.