విజయసాయిరెడ్డి రాజీనామాపై ఎమ్మెల్యే సోమిరెడ్డి కీలక వ్యాఖ్యలు..!

-

విజయసాయిరెడ్డి రాజీనామాపై టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే సోమిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. విజయసాయి రెడ్డి పాపాలన్నీ చేసేసి ఇప్పుడు రాజీనామాతో రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించడం విచిత్రంగా ఉంది. సేద్యం చేస్తానంటున్నావ్..దోచేసిన నల్లడబ్బుతో చేస్తావా..ఏంటీ.. ఇప్పుడు నువ్వు సేద్యంలో దిగితే రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని ఎవరు పూడుస్తారు. 2004 నుంచి 2009 వరకు అప్పటి సీఎం కుమారుడిని ముందు పెట్టి ఏ2గా సకల పాపాలు చేస్తివి.

గత ఐదేళ్లూ అరాచక పాలనకు, దోపిడీకి రైట్ హ్యాండ్ గా నిలిచి ఏ2 స్థానాన్ని కొనసాగిస్తివి. పాపాలన్నీ చేసేసి ఇప్పుడు రాజీనామా చేస్తానంటే పరిహారం జరిగేదెట్టా. ముందు అప్పుడు దోచుకున్న రూ.43 వేల కోట్లతో పాటు మొన్న ఐదేళ్లలో జగన్ రెడ్డితో కలిసి దోచేసిన రూ.లక్ష కోట్ల ప్రజల సొత్తు బయటపెట్టు. దోచేసిన మొత్తం పాపపు సొత్తు ఎక్కడుందో చెప్పు.. అప్పుడైనా నిన్ను భగవంతుడు క్షమించే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే చేసిన పాపాలకు సంబంధించిన కేసుల భయం స్పష్టంగా కనిపిస్తోంది. అంతేనా లేక నీతో పాటు నీ అల్లుడి కంపెనీ అరబిందోను కాపాడటానికి ఈ నిర్ణయం తీసుకున్నారా.. ఈ రాజీనామాల పరంపరం ఒక్క విజయసాయిరెడ్డితో ఆగేటట్టు కూడా లేదు.. రాత్రికో, రేపు రాత్రి లోపల మరో ఒకరిద్దరు సభ్యులు కూడా రాజీనామా చేసినా ఆశ్చర్యపోనక్కరలేదు అని ఎమ్మెల్యే సోమిరెడ్డి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version