
జగిత్యాల పట్టణం ధరూర్ క్యాంపులోని జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో ఈ నెల 24న జాబ్ మేళా ఉంటుందని జిల్లా ఉపాధి కల్పనాధికారి బింగి సత్యమ్మ తెలిపారు. హైదరాబాద్ కు చెందిన ప్రయివేటు సంస్థలో ఉద్యోగాలకు మౌఖిక తదితర పరీక్షలు ఉంటాయని చెప్పారు. 18 నుంచి 28 ఏళ్లు కలిగి, ఇంటర్మీడియట్, డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులని తెలిపారు.