ధర్మారం మండల కేంద్రంలో నూతనంగా వెలసిన సమ్మక్క సారలమ్మ గద్దెలను బుధవారం మంత్రి కొప్పుల ఈశ్వర్ సందర్శించారు. సమ్మక్క సారలమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి మొక్కులు చెల్లించారు. అనంతరం నంది మేడారంలో నిర్వహిస్తున్న సమ్మక్క సారక్క జాతరను సందర్శించారు. ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ, సింగిల్విండో చైర్మన్ బలరాం రెడ్డి తదితర నాయకులున్నారు.